పాలక్కాడ్ లోని పట్టాంబి గ్రామానికి చెందిన అతుల్య ఇంటర్నేషనల్ మెరైన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందిన కఠినమైన క్లాస్ ఎయిర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించారు దీన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా కె.వి అతుల్య రికార్డ్ నెలకొల్పారు ఈ లైసెన్సు 130 పైగా దేశాల్లో చెల్లుబాటు అవుతుంది స్కూబా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించడం చాలా శారీరక శ్రమతో కూడినది ప్రమాదకరమైంది కూడా సముద్రంలో 50 మీటర్ల లోతులో అనేక నిమిషాల పాటు శ్వాస నియంత్రించుకోగలగాలి.అతుల్య కు నీళ్లు అంటే చాలా ఇష్టం డిగ్రీ చదివిన తర్వాత కోవలం లోని ఒక స్కూబా డ్రైవింగ్ అకాడమీ లో చేరింది.ఆ బ్యాచ్లో ఆమె ఒకే ఒక మహిళ.తన కెరీర్ అదేనని భావించి ఆ కోర్సు పూర్తయ్యాక అండమాన్ కొచ్చిన్ లో స్కూబా ఇన్స్ట్రక్టర్ గా చేరారు. తీర ప్రాంత పోలీసులకి అగ్నిమాపక సిబ్బందికి డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చారు. తరువాత ఎంతో శ్రమతో కమర్షియల్ లైసెన్స్ సాధించుకున్నది అతుల్య.













