Thursday, 23 Jul, 2026

మహిళల సంక్షేమం కోసం కృషి

హాకీ వాలి సర్పంచ్ అంటారు నీరు యాదవ్ ను రాజస్థాన్ లోని ఝుంఝునున్ జిల్లా లంబి అహిర్ లో ఉంటుంది. ఆ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచింది. ఒక మహిళ సర్పంచ్ కావడం ఇదే మొదటిసారి. గ్రామంలోని మహిళా రైతుల సాధికారత కోసం సచ్చీ సహేలి మహిళ ఆగ్రో లిమిటెడ్ ప్రారంభించింది గ్రామంలో ఆడపిల్లలకు క్రీడా శిక్షణ కోసం అదితి ఫౌండేషన్ నెలకొల్పింది ప్లాస్టిక్ రహిత సమాజం సృష్టించేందుకు స్టీల్ పాత్రల […]

మహిళా ఉద్యోగాలకే ప్రాధాన్యత

విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసిన అశ్విని అశోకన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పట్టు సాధించింది. ఇంటెల్ సంస్థలో పనిచేసిన అశ్విని మ్యాడ్ స్ట్రీట్ డెన్ లాంచ్ చేసింది. క్లయింట్స్ కు ఆర్టిఫిషియల్ డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేటిక్ ఫ్లాట్ ఫామ్ ఈ మ్యాడ్ స్ట్రీట్ డెన్. కటింగ్ ఎడ్జ్ ఏ ఐ టెక్ ప్రాడక్ట్ ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది ఈ డెన్. వ్యూ ఏ ఐ ఆధారిత ఫ్లాట్ ఫామ్ ను […]

సంపన్న మేనేజర్  

అరిస్టా నెట్ వర్క్ సీఈఒ జయశ్రీ ఉల్లాల్ భారతీయ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్ లో తొలి స్థానం స్థానంలో నిలిచారు హురున్ ఇండియా రీచ్ లిస్ట్ 2025 లో ఆమె పేరు నమోదై ఉంది. జయశ్రీ లండన్ లో జన్మించారు చిన్నతనం న్యూఢిల్లీలో గడిచింది. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు.సిస్కో లో 15 ఏళ్లు పనిచేశాక అరిస్టా నెట్ వర్క్ లో చేరారు.2008లో అరిస్టా నెట్ వర్క్ సీఈఒ ప్రెసిడెంట్ గా […]

పక్షి ఈకల గ్రంథాలయం

బెంగళూరు లో పక్షి ఈకల లైబ్రరీ నడుపుతున్నారు ఈషా మున్షీ ఫెదర్ లైబ్రరీ పేరుతో నడిచే ఈ గ్రంథాలయంలో 160 రకాల పక్షుల ఈకలు 400 పక్షుల అవశేషాలు ఉన్నాయి.వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన ఈషా ఆర్నిథాలజి (పక్షుల శాస్త్రం) చదివారు.పక్షుల పరిరక్షణ కు నడుము కట్టారు.బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ లో పక్షుల విభాగానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. వాతావరణంలో ఇమడలేక మరణించిన పక్షుల ఈ కల అధ్యయనం ద్వారా ఆమె వాటి సమస్యను […]

అందమైన టెర్రకోట నగలు

కర్ణాటక లో స్థిరపడిన ప్రశాంతి సుధీర్ క్లే హోమ్,పేరుతో టెర్రకోట నగల తయారీ అమ్మకాలు చేస్తున్నారు ఎమ్యెస్సి జువాలజీ చదువుకున్న ప్రశాంతి మైసూర్ లోని ఒక హ్యండి క్రాఫ్ట్స్  వర్క్ షాప్ లో టెర్రకోట నగలు తయారీ నేర్చుకున్నారు. 2018 లో వ్యాపారం మొదలుపెట్టారు సెరామిక్ క్లే వస్తువులను థీమ్ స్టైల్ లో డిజైన్ చేశారామె  కప్ లు, జార్ లు, ప్లేట్ లు, జాడీలు వంటివి కార్వింగ్స్ తో ఫ్యూజన్ స్టైల్ లో మారుస్తారు.వీటికి మంచి […]

మహిళ ర్యాలీ డ్రైవర్

కేరళ కు చెందిన మొదటి మహిళ ర్యాలీ డ్రైవర్ అతిరా మురళీ బైక్ లా నుంచి టిప్పర్ల వరకు దేన్నయినా నడపగలదు అతిరా ఇన్ని రకాల వాహనాలకు లైసెన్స్ లు పొందిన పిన్న వయస్కురాలిగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేరు నమోదయింది.కేరళలోని కొట్టాయం కు చెందిన అతిరా తండ్రి ట్రాన్స్ పోర్ట్ రంగానికి చెందిన వారు. ఆ రకంగా వాహనాల పైన ఇంట్రెస్ట్ తో మోటార్ స్పోర్ట్స్ వైపు వచ్చింది అతిరా.2000 లో తొలిసారిగా జాతీయ […]

ఎడారిలో ఉపాధి

ఆమ్లా అశోక్ రుయా ముంబైలో స్థిరపడిన ప్రభుత్వ సామాజిక కార్యకర్త.ఎడారి భూములను సస్యశ్యామలంగా మార్చి వాటర్ మదర్ ఆఫ్ ఇండియా గా పేరు పొందారు.2003లో ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చెక్ డ్యామ్ లు, చెరువులు నిర్మించారు.2006లో రాజస్థాన్ లోని మండవార్ లో మొదటి చెక్ డ్యామ్ పని మొదలుపెట్టి స్థానికుల సాయంతో ఆ గ్రామాల్లో చెరువులు నిర్మించారు అక్కడే బంజారా భూముల్లో నదులను పారించారు. నెమ్మదిగా పంటలు పండాయి 11 లక్షల మంది గ్రామీణులకు […]

గిరిజన గ్రామంలో ఉచిత బడి

జిలింగ్‌సెరెంగ్ పశ్చిమబెంగాల్ లోని ఒక గిరిజన గ్రామం.12వ తరగతి చదువుకున్న మాలతి ముర్మ ఆ గ్రామంలో గిరిజన బాల బాలికల కోసం తన ఇంటిని బడి గా మార్చింది.ఆమె నివసించే మట్టి గదుల ఇంట్లో మాలతి బాల స్కూల్ పేరుతో ఉచిత విద్య బోధన చేస్తోంది. ఇంగ్లీష్,గణితం,సైన్స్ లో ప్రాథమిక పాఠాలు బోధిస్తోంది.ఆమెకు ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేదు అయినా గిరిజన బాలలను విద్యావంతుల్ని చేయడం ఆమె లక్ష్యం.45 మంది పిల్లలతో ఆమె పాఠశాల విజయవంతంగా నడుస్తోంది.

శీతాకాలపు ట్రెండ్

ముఖమల్ పేరుతో పిలిచే ఈ వెల్వెట్ డ్రెస్ లకు వింటర్ సీజన్ చాలా స్పెషల్. ఎంబ్రాయిడరీ తో మెరిసిపోయే ఈ వెల్వెట్ శీతాకాలపు పండుగల వేడుకల్లో రారాజుల వెలిగిపోతుంది. పచ్చ,ఆకుపచ్చ,నెమలి కంఠం రంగు, బ్లాక్ వంటి షేడ్స్ సెలెబ్రెటీ వార్డ్ రోబ్స్ లో రిచ్ గా మెరుస్తున్నాయి.ఈ మధ్యకాలంలో ఒక ఫోటో షూట్ లో డిజైనర్ నూరి తయారు చేసిన వెల్వెట్ కఫ్తాన్ లో శోభిత దూళిపాళ మెరిసిపోయారు. అతి తక్కువ ఆభరణాలు తక్కువ మేకప్ తో […]

అందరి ప్రశంసలు ఆమెకే

దేశానికి తొలి మహిళల అంధుల వరల్డ్ కప్ ను అందించి సామాన్యుల నుంచి ప్రధాని మోదీ వరకు ప్రశంసలు అందుకున్నది. భారత జట్టు కెప్టెన్ రాయలసీమ అమ్మాయి దీపిక సత్యసాయి జిల్లా మడకశిర లోని తంబల హట్టి అనే గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేసే కుటుంబంలో జన్మించిన దీపిక స్కూల్ టీచర్ల ప్రోత్సాహంతో క్రికెట్ నేర్చుకుంది. బాల్యంలోనే ప్రమాదంలో ఒక కన్ను పోగొట్టుకున్న దీపిక జాతీయ అంధుల క్రికెట్ బోర్డ్ లో స్థానం సంపాదించుకున్నది భారత జట్టుకు […]

ఇంకో లతా మంగేష్కర్

ఛత్తీస్‌గఢ్ లోని మావోయిస్టుల కంచుకోట పోలంపల్లి గ్రామానికి చెందిన బాలిక సోధి వీరే ను సుక్మా లతా మంగేష్కర్ అని పిలుస్తారు. జన్మించిన కొంతకాలానికే కళ్ళకు అనారోగ్యం వచ్చింది. పేదరికం కారణంగా వైద్యం చేయించలేకపోయారు తల్లిదండ్రులు. దీంతో సోధి వీరే కు కంటి చూపు పోయింది. ఆకార్ కు చెందిన గురుకుల పాఠశాలలో చదువుకున్నది. అక్కడ సాధారణ విద్యతోపాటు సంగీతం కూడా నేర్చుకున్నది పాటలు, గేయాలు, గీతాలు అద్భుతంగా పాడుతుంది సోధి వీరే.కంటి చూపు లేకపోయినా మనసు కదిలించే […]

దేశానికి గర్వకారణం

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా బరువే గ్రామంలో పుట్టిన కావ్య వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టింది పుట్టుకతోనే అందురాలు శారదా దేవి బ్లైండ్ డెవలప్మెంట్ సెంటర్ లో చదువుకుంది. అక్కడే క్రీడలతో పరిచయం అయింది. టీచర్ల శిక్షణతో పరుగు లాంగ్ జంప్ పోటీల్లో పాల్గొన్నది. అటు తర్వాత పదో తరగతి పూర్తి చేసి సమర్ధనం ట్రస్ట్ లో చేరింది. అక్కడే క్రికెట్ శిక్షణ పొంది టి-20 అంధ మహిళల క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకున్నది. తనదైన ప్రత్యేక ప్రతిభ […]

ఈ నిరుపేద సింగర్ ఇవ్వాల్టి స్ఫూర్తి

పంజాబ్ లోని మెగా కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి యువ రాపర్ గా, దట్ గర్ల్ పాటతో లేడీ మోసేవలా వాళ్ళ గా పేరు తెచ్చుకున్నది పరమ్‌జీత్ కౌర్. ఇళ్లల్లో పనులు చేసుకునే నిరుపేద కుటుంబంలో పుట్టిన పరమ్ కాలేజీలో ఇంటర్ చదువుకుంటూ సంగీతం లో ప్రతిభ చూపెట్టటం మొదలుపెట్టింది.పాడే పద్ధతి లో ర్యాప్ ను ఎంచుకున్నది. ఇంగ్లాండ్ లో, స్థిరపడిన రికార్డ్ ప్రొడ్యూసర్ మనీ సింధు ఆమె పాట విని పరమ్ తొలి పాట […]

కాఫీ కి గుర్తింపు

మన్యం ఉత్పత్తులను అమ్మకాల్లో గణనీయమైన మార్పు వచ్చి గిరిజనుల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడే కారణంగా అరకు కాఫీ కి జాతీయ స్థాయిలో గుర్తింపు, ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. ఈ ఘనత సాధించిన ఘనత మాత్రం గిరిజన సహకార సంస్థ (జి సి సి) ఎం డి కల్పన కుమారి కే దక్కుతుంది. అరకు కాఫీ ఇప్పటికే ఖండాంతరాలు దాటి పోయింది.దీనికి తోడు అంతర పంట […]

అడవుల్ని కాపాడటం కోసం శిక్షణ

దేశంలో మొదటిసారిగా నేచర్ గైడ్ అకాడమీ స్థాపించి అడవుల్లో క్యాంప్ లు నిర్వహిస్తూ టూరిస్ట్ లకు అడివిని పరిచయం చేస్తున్నారు పాయల్ మెహతా. ముంబై కు చెందిన పాయల్ కు ప్రకృతి అంటే ఇష్టం. పర్వత రోహకురాలిగా శిక్షణ పొందారు.ఆమె భర్త హర్ష.జె తో కలిసి అకాడమీ స్థాపించి  కన్హా నేషనల్ పార్క్ లో 18 మంది ప్రకృతి ప్రేమికులకు శిక్షణ ఇచ్చారు. బర్డ్స్ వాచర్స్, నేచురలిస్ట్ లు ఫారెస్ట్ హైకర్స్ కు గైడ్ ల కొరత […]

తాజా ట్రెండ్ ఇవే

వేడుకల్లో సౌకర్యంగా స్టైల్ గా ఉండే షరారాలు ఇప్పుడు ట్రెండ్. ఎంబ్రాయిడరీ, అద్దం పనితనంతో కూడిన షరారాలు ప్రింటెడ్ డిజైన్లు కూడా బాగా ఆదరణ పొందుతున్నాయి. సాంప్రదాయ సమకాలీన స్టైల్ తో బరువైన షరారాలు ఆధునిక ఫ్యూజన్ ఛాయిస్ గా పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ షరారాల తో భారీ ఆభరణాలు బాగుంటాయి. ఈ దుస్తులతో చాంద్ బాలి కంగన్, కడా వంటి ఆభరణాలు చక్కగా మ్యాచ్ అవుతాయి. రాళ్ల నగలు వేసుకొని హై హీల్స్ తో నడిస్తే […]

స్నూకర్ ప్రపంచ ఛాంపియన్

ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్ గెలిచిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. చెన్నై లో పుట్టి పెరిగిన అనుపమ స్పోర్ట్స్ పర్ఫామెన్స్ స్పెషలిస్ట్ అయినా మామయ్య కె.నారాయణన్ మార్గదర్శకత్వం లో ఆటలలో పరిమితి సాధించింది స్నూకర్, ఇంగ్లీష్ బిలియర్డ్స్ లో ఎంతో పరిణీతి సాధించిన అనుపమ జాతీయస్థాయిలో ఎనిమిది టైటిల్స్ సాధించింది.2023లో ప్రపంచ మహిళల అండర్ 21 స్నూకర్ టైటిల్ సాధించింది.ఈ సంవత్సరం ప్రపంచ ర్యాంకింగ్ లో […]

విజయవంతం దీప్తి ప్రయాణం

ట్రావెల్ వ్లోగర్ సోషల్ మీడియాలో తన తనదైన ప్రత్యేక ముద్రవేశారు దీప్తి భట్నాగర్.ఎన్నో తెలుగు తమిళ హిందీ సినిమాల్లో నటించిన దీప్తి పర్యటనల వైపు మొగ్గు చూపించారు.2001లో సొంత టీవీ ప్రొడక్షన్ సంస్థ ప్రారంభించి ఛానల్ షో యాత్ర అండ్ ముసాఫిర్ హూ యారో శ్రీకారం చుట్టారు. 90 దేశాలు తిరిగి యాత్ర పేరుతో దైవ క్షేత్రాలు పరిచయం చేశారు. డిజిటల్ మీడియా లో ఆమెకు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రముఖ నటుడు ధర్మేంద్ర […]

జల సంరక్షణ కు రివార్డ్

ఐఏఎస్ అధికారిణి టీనా దాబి తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జల్ సంజయ్ జన్ భగీరది (జన భాగస్వామ్యంతో జల సంరక్షణ) అవార్డ్, రెండు కోట్ల నగదు బహుమతి అందుకొన్నారు రాజస్థాన్ లోని బార్మర్‌లో జల సంరక్షణకు నడుం కట్టారు. నీళ్ల ట్యాంకులు చెరువులు దిగుడు బావులను పునరుద్దరించారు. గ్రామాల స్వయం సమృద్ధి మహిళ సాధికారతే లక్ష్యంగా పనిచేసే టీనా దాబి భోపాల్ లో పుట్టి పెరిగారు.2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి తొలి […]

సమాజ శ్రేయస్సుకు నెమ ఎఐ

స్టార్టప్ నెమ ఎఐ స్టార్టప్ స్థాపించి సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నది నిధి. మెదడు పనితీరు గుర్తించేందుకు దాని గురించి అవగాహన కలిగించేందుకు, మార్గ నిర్దేశనం చేసేందుకు నెమ ఏఐ ఉపయోగపడుతుంది. గత సంవత్సరం షార్క్ ట్యాంక్ ఇండియా టెలివిజన్ షో పాల్గొన్న తర్వాత ఇన్వెస్టర్ల నుంచి ఆమె స్టార్టప్ కు చక్కని స్పందన వచ్చింది అటిజం,డిస్లెక్సియా అటెన్షన్-డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ వంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా […]