ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వృక్షం మెధూసెలా.ఇది కాలిఫోర్నియాలోని ఇన్యో జాతీయ అటవీ ప్రాంతంలో పెరిగిన పైన్ వృక్షం. ఈ చెట్టును కాపాడేందుకు దీని ఖచ్చిత మైన ప్రాంతాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంది యూఎస్ ఫారెస్ట్ సర్వీస్. దీని వయసు సుమారు 4857 సంవత్సరాలు. ఒక అధ్యయనం ప్రకారం ఈ వృక్షం గిజా లోనీ ప్రాచీన ఈజిప్ట్ పిరమిడ్ నిర్మాణం కంటే చాలా ముందుది అని తేలింది. ఈ చెట్టు అసాధారణమైన దీర్ఘాయువు కి కారణం కఠినమైన ఎత్తైన పర్వత ప్రాంత వాతావరణం లో గడ్డకట్టిన ఉష్ణోగ్రతలు ,సారం లేని నేల పోషకాల కొరత వల్ల ఇది చాలా నెమ్మదిగా పెరిగి చిరాయువు గా జీవించింది.














