బెంగళూరుకు చెందిన సృష్టి కిరణ్ ఏడేళ్ల వయసులోనే టెన్నిస్ లో వరుస విజయాలతో సంచలనం సృష్టించింది. ఆమె తల్లి వినయ కిరణ్, తండ్రి గోపాల రాజన్ .కేవలం నాలుగున్నర ఏళ్ళ వయసులో కిరణ్ బెంగళూరులోని కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ అసోసియేషన్ లో శిక్షణ ప్రారంభించింది. ఏఐటిఏ అండర్ టెన్ ఛాంపియన్ షిప్స్ లో వరుసగా రెండు సార్లు గెలిచిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. గత వారం మధ్య అమెరికా దేశమైనా గ్వాటెమాలాలో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ జె 100 ఈవెంట్ లో రన్నరప్ గా నిలిచింది .దీని ఫలితంగా తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకింగ్ 357 చేరుకొని అండర్ 13 వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది సృష్టి కిరణ్.














