December 2016
సందేహించకుండా సమాధానాలిస్తున్నారు
వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు అంటగడతుంటారు. ఎంతకాలం సహించటం. సహనానికి కుడా ఒక హద్దు ఉంటుంది. అందుకే ఈ కాలం హీరోయిన్లు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు. తమ గురించి వచ్చే రూమర్స్ ,ఎఫైర్స్,లవ్ ,సెక్స్, విడిపోవటం దేని గురించి అయిన చాల బోల్డ్ గా మాట్లడేస్తున్నారు. […]
బహుమతులు పంపేస్తారు వాళ్ళు
ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ స్టార్ట్ అప్ అమ్మాయి అను గుప్తా,స్వప్న చౌదరి. వీళ్ళిద్దరు మేక్ మై విషెష్.కమ్ పెట్టారు. అను ఐటీ అయ్యాక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో పని చేశారు. అను బ్యాంకర్ ఐసిఐసిఐ ,స్టార్టప్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంక్ లలో పని చేశారు. ఇద్దరి అభిరుచి ఒకటే వినియోగదారునుకి పనికొచ్చే చిన్న […]
ఏ పాలు తాగిన ఒకటే
పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. […]
కాగితపు కళా ఖండాలు
అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్చీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో సృజనాత్మకంగా తయారుచేస్తారు. కలప ఇనుమూ ప్లాస్టిక్ ఉండగా పేపర్ తో ఎందుకూ అంటే గతంలో ఎన్నెనో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారుచేసారు. ఇవి కూడా దృఢంగా వుంటాయని నేను పరిశోధించి తెలుసుకున్నారు. ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుంది కదా అంటుందామె. వేస్ట్ పేపర్ తో తయారుచేసిన ఏ […]
పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !
ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం […]
కళ్ళు మూసుకుని ఆలోచిస్తే గుర్తొస్తాయి
మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్ హారర్ సినిమా చూపించారట. సినిమా చూసిన వెంటనే అందులో సన్నివేశాల గురించి ప్రశ్నిస్తే వచ్చిన సమాధానాలు రాసుకుని వాళ్ళని కళ్ళు మూసుకుని ఆ సినిమా గురించి ఆలోచించమంటున్నారట. 71 శాతం మంది కళ్ళు మూసుకుని ఆలోచించి కరెక్ట్ సమాధానాలిచ్చారట. సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే మనం ఇంట్లో మరచిపోయే వస్తువుల గురించి […]
నాజూకు చీరల పై డిజిటల్ ప్రింట్స్
అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి లెనిన్, క్రేప్ చీరాలపైన డిజిటల్ ప్రింట్స్ చాలా అందంగా వుంటున్నాయి. అసలే అతి నాజూకైన చీరలు, వాటి పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన అందమైన ప్రకృతిని తీర్చిదిద్దినట్లు డిజిటల్ డిజైన్స్ […]
రెండడుగుల సూపర్ స్టార్
ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ హత్యల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ప్రచారం నిర్వహించింది. ఇప్పుడీమెకు 22 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుకెక్కింది. టీవీల్లో కనపడుతూ వుంటుంది. అమెరికన్ హారర్ సిరీస్ లో ముఖ్య పాత్ర నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించింది. ఫ్యాషన్ అంటే చాలా క్రేజ్ ఎత్తు బరువుకు […]
నిరంతరం బొమ్మలు వేయాలన్నదే దీపా ధ్యేయం
ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్ చర్కోల్, కలర్ పెన్సిల్ ఇలా అన్ని మాధ్యమాలలో బొమ్మలు వేస్తుంది. వాటర్ కలర్స్ ప్రాక్టిస్ చేసి హైదరాబాద్ కళామందిర్ లో మొదట గ్రూప్ షో, తర్వాత సోలో ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. ఢిల్లీ లోని పిబిసి ఆర్ట్ గ్యలరీలో షో చేసాక, చైనాలో వర్క్ షాప్ లో లండన్ లోని […]
అత్యంత మృదువైన అహింసా పట్టు
పట్టు దారం కోసం పట్టు పురుగులను (కకూన్) వేడి నీళ్ళల్లో పడేసి ఆ దారాన్ని వలుచుకుంటారు. కానీ జ్ఞానం వున్న మనిషిగా జీవన వైవిధ్యాన్ని ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని నోరు లేని పట్టు పురుగులను హింసించకూడదు అని అలోచించి వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్య అహింసా పద్దతిలో ఆలోచించారు. పట్టు పురుగులను చంపకుండా దారం తీసే పద్దతిని కనిపెట్టారు. ఈ దారానికి కొంచం మెరుపు తక్కువ. కానీ మృదువుగా వుంటుంది. నాణ్యతలో లోపం […]
ఇలాంటి నమ్మకాల వల్ల నష్టమే ఎక్కువ
ప్రపంచంలో చాలా మందికి కొన్ని నమ్మకాలుంటాయి. కొందరు శకునాలను నమ్ముతారు. 13 వ సంఖ్య అంటే ఇంగ్లాండ్ లో చాలా భయపడతారు. ఆ నెంబర్ తమ ఇళ్ళకి పెట్టుకోరు. అక్కడ హోటల్స్ లో 12వ గది తర్వాత 14వ గది ఉంటుంది. కొందరు లక్కీ చీర లక్కీ నెంబర్ లక్కీ కలర్ అంటుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల వ్యక్తిగతంగా అవి పాటిస్తారు. గనుక ప్రమాదం ఉండదు. సామజిక ఇబ్బందులు తెచ్చే నమ్మకాలనే మూఢ నమ్మకాలంటారు. ఉదాహరణకు ఇలాంటి […]
ఈ అద్భుతమైన టానిక్ గురించి విన్నారా?
హాయిగా నవ్వడం ఒక అద్భుతమైన వరం. ఇళ్ళలో అస్తమానం నవ్వటం తప్పని చెపుతారు కానీ ఎప్పుడు ఎలా నవ్వొచ్చో మాత్రం నేర్పారు. కొందరు పిల్లలు అందుకే కదిలిస్తే కారుస్తామన్నట్లుంటారు. అలా వుంటే పిల్లాలతోనే కాదు పెద్ద వాళ్ళతో కూడా ఎవ్వళ్ళు మాట్లాడరు. నవ్వటం, నవ్వించటం చేతగాక పోతేనే వంటరితనం వస్తుంది. అందుకే నవ్వటం కూడా ఒక కళే అనుకుని దాన్ని సాధన చేయాలి. నవ్వు ఒక్కటే కష్టాల్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాలని ఎదుర్కునే శక్తినిస్తుంది. మూడ్ మార్చుకోగలిగితే […]
సెంటిమెంట్ సినిమాలు చూపించండి
ఆలు మగలు మధ్య బంధం గట్టిగా ఉండాలంటే ఇద్దరికీ కలిసి సెంటిమెంట్ సినిమాలు చూడమంటున్నారు పరిశోధకులు . విడాకుల కోసం వచ్చిన దంపతులకు మానవ సంబంధాలకు గురించిన కౌన్సిలింగ్ ఇస్తే వారిలో విడిపోవాలన్న కోరిక తగ్గటానికి రెండు మూడేళ్లు పడుతోందిట. దీనికంటే సినిమాలు చూపిస్తే బెస్ట్ కదా అంటున్నారు న్యూయార్క్ లోని బింగ్ టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాధ్యు జాన్సన్. సాధారణంగా మనుషులు సినిమాల్లోని పాత్రలతో తమను పోల్చుకుని చూస్తుంటారు కనుకే చాలా సినిమాలు హిట్ అవుతుంటాయంటారు. […]
దంగల్ సినిమా రాబోతోంది
రెజ్లర్ గీతాఫోగట్ ఫ్యామిలీ స్టోరీ దంగల్ పేరుతో సినిమాగా రాబోతోంది. గీత తండ్రి ఇంటెర్నేష్నల్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ పాత్రలో అమీర్ ఖాన్ 8 సంవత్సరాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహావీర్ సింగ్ కూతుళ్లు గీత బబిత రీతూ సంగీత ఇంకో ఇద్దరు పెంపుడు కూతుళ్లు వినేష్ ప్రియాబెక అందరు రెజ్లర్స్. అమీర్ ఖాన్ తో పాటు ఈ అమ్మాయిల పాత్రల్లో ఫాతిమా ,సాన్యా, జైరా లను పదివేల మందిని ఆడిషన్ చేసి […]
మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం
మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. […]
ఈ మ్యూజియం కోసం 30 ఏళ్ళు కష్టపడింది
తహిర్ సలహోవ్ రష్యన్ పెయింటర్. ఆయన సోదరి జారీఫా సలహోవా. అజర్ బైజాన్ రాజధాని నగరం బాకు లో ఈమె మినియేచర్ బుక్స్ మ్యూజియం ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఒకేఒక మినియేచర్ బుక్స్ మ్యూజియం ఇదే. 30 ఏళ్ల పాటు కష్టపడి అజేరా రష్యన్ ఇంగ్లీష్ జర్మన్ వంటి ఎన్నో భాషల్లో వున్న గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. 17వ శతాబ్దం నాటి మినియేచర్ ఖురాన్ ప్రతి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదే […]
ఖరీదైన డ్రెస్ కి ఈ మాత్రం జాగ్రత్త కావాలి
ఖరీదైన బట్టలు కొంటు వుంటాం. కొంత కాలం పాటు ఆ కొత్త దనం పోకుండా వుంటే బాగుంటుంది. ఇస్త్రీల వల్ల చెక్కగా వుతకడంతోనూ సరిపోదు. వాటి గురించి శ్రద్ద తీసుకోవాలి. ఆడపిల్లల డ్రెస్ లు జరీలు, కుట్టు పని, పూసలు, కుందన్ వర్క్ వీటితోనే హెవీగా కనిపిస్తాయి. వాటిని మాములుగా ఉతికి అరేస్తే నాలుగైదు వుతుకులకే వేసుకునేందుకు బాగోవు. అతి జ్యగ్రత్తగా ఏ ఫంక్షన్లోనో వేసుకోవడం వెంటనే బధ్రపరచడం చేయాలి. దుస్తులకి కొత్త అందం కోసం కొన్ని […]
అంతరంగాన్ని ఆవిష్కరించే రంగులు
మనం ఇష్టపడే రంగులు వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని చెపుతుంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. తెలుపు రంగును స్వచ్ఛతకు గుర్తుగా భావిస్తాం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు స్వచంగా నిర్మలమైన మనసు తో ఉంటారని ప్రతి విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తారని అంటారు. నలుపు రంగు ఇష్టపడేవాళ్లు బలమైన వ్యక్తిత్వం గలవాళ్ళు. ఇంకొకరి ఆధిపత్యాన్ని సహించరు. ఎరుపు ఇష్టపడేవాళ్ళకు స్వాభిమానం ఎక్కువ. శక్తి సామర్ధ్యాలు ఎక్కువే. కోపిష్టులు కూడా. నీలి రంగు ను ప్రేమించే వాళ్ళు ప్రాక్టికల్ […]
ఈమె రొమాంటిక్ సాహిత్య సృష్టికర్త
ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్ తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతి వుంది. ఆమె రాసిన 723 నవల్లో 38 భాషల్లోకి అనువాదమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫహ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. పింక్ గౌను టోపీతో అలనాటి బ్రిటన్ మీడియా పర్సనాలిటీగా ఎంతో యాక్టీవ్ గా 98 ఏళ్ళు జీవించిన బార్బరా తన పుట్టిన రోజులు స్నేహితుల […]
