Sunday, 28 Jun, 2026

మొక్కలు జాగ్రత్త 

ఎండలు పెరుగుతున్నాయి ఇంట్లో పెంచుకొనే ఇండోర్ ప్లాంట్లు కూడా ఎండకు వాడిపోతాయి పీస్ లిల్లీ,కోలియస్ ఆంధురియం కెలడియం వంటివి త్వరగా వేడికి గురవుతాయి ఎండకు,ఎసి నుంచి వచ్చే పొడిగాలికి నీళ్లు త్వరగా ఆవిరి అవుతాయి. పశ్చిమ దక్షిణ దిశల్లో ప్లాంట్స్ ని వేరే చోటికి మార్చాలి. కిటికీలు,బాల్కనీలలో షేడ్ నెట్ లు లేదా నీళ్లతో తడిపిన గొనె సంచి లు వేలాడదీయాలి. ఎండవేడి లో ఉన్నప్పుడు మొక్కను మరోదానికి మార్చటం ఎరువులు వేయటం,కత్తిరించటం చేస్తే మొక్కలు కోలుకోలేవు.

పదేళ్లు వాడవు 

ఎంతో అందమైన గులాబీలు జీవితకాలం ఒకటి రెండు రోజులే తరవాత నెమ్మదిగా వాడిపోతాయి. కానీ అవి పదేళ్ల వరకు పాడవకుండా ఇంగ్లాండ్ లోనే ఎండ్యూర రోజెస్ కంపెనీ ఒక కొత్త ప్రక్రియ కనిపెట్టింది. ఇప్పుడు మనదేశంలో ఒన్ రోజ్ సంస్థ వాళ్ళు నాలుగైదేళ్లు నిల్వ ఉండే గులాబీలను అందిస్తున్నారు. భిన్నమైన రంగుల్లో గులాబీలు ప్రపంచమంతటా దొరుకుతాయి వాటిని ప్రత్యేక వాతావరణంలో ఉంటుందని చుట్టూ ఒక రక్షిత గ్యాస్ పొరను ఏర్పాటు చేస్తారు ఇలా చేతిలోకి తీసుకుని రెండు […]

నటించే అవకాశం ఉంటే చాలు

సినిమా సినిమాకు కొత్త గా ప్రయత్నం చేయాలని ఉంటుంది కానీ అలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు అంటుంది లావణ్య త్రిపాఠి. ప్రతి సినిమా కథలోనూ కథానాయిక పాత్ర ప్రమేయం చాలా తక్కువ తేడీ ఓరియంటెడ్ సినిమా అయితే తప్ప హీరోయిన్ నటన నైపుణ్యం పూర్తి స్థాయిలో బయట పడదు. మరీ అంత స్థాయిలో లేకపోయినా చాలు సెట్ లో కాస్త కష్ట పడే అవకాశం వస్తే అదే గొప్ప. రేపు సెట్ కి వెళతామనుకొనే ముందు […]

ఆమెతో మొదలు

ఎనిమిది దశాబ్దాల క్రిందట ముంబాయ్ లో బిఎస్సి పూర్తి చేసిన కమలా సోహాని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేస్తే ఆమెకు ప్రవేశం లభించలేదు. ఆడవాళ్లు సైన్స్ పరిశోధన ఏం చేస్తారని నోబెల్ గ్రహీత ఆ సంస్థ అధ్యక్షుడు సి.వి.రామన్ ఆమె దరఖాస్తు రిజెక్ట్ చేశారు. కమలా ఆయన ఆయన ఆఫీస్ ముందు సత్యాగ్రహం చేసి ఆయన పెట్టిన షరతులు ఒప్పుకొని ఐఐఎస్‌సీ లో ప్రవేశం పొందింది. ఆ తర్వాత సైన్స్ […]

ఇదే ప్రత్యామ్నయం

ఉప్పు వాడకం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యం అంటారు. ఉప్పుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఇంట్లో టేబుల్ సాల్ట్ పేరుతొ వాడేది అయోడైడ్ సాల్ట్ దాన్ని రోజు మొత్తంలో 150 మైక్రోగ్రాములకు మించనివ్వరాదు. కోషర్ సాల్ట్ పొడవాటి పలుకుల రూపంలో ఉంటుంది. ఈ ఉప్పులో అదనంగా అయోడిన్ కలపరు. కోషర్ సాల్ట్ ను 2300 మిల్లీగ్రాములు వరకు తీసుకోవచ్చు ఇక సీ సాల్ట్ లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, జింక్, అయోడిన్ వంటి వేర్వేరు ఖనిజ లవణాలు ఉంటాయి.ఇది […]

పదేళ్లు వాడొచ్చు

హార్వర్డ్ విద్యార్థి ఇరాగుహ అసన్ పేరుతొ పర్యావరణ హిత నెలసరి కప్స్ తయారీ మొదలుపెట్టారు.ఇవి పదేళ్ల పాటు వాడుకోవచ్చు నెలనెలా వాడుకొనే నెలసరి సానిటరీ పాడ్స్ కు బదులుగా వీటిని ఉపయోగించవచ్చు ఈ మేన్స్ స్ట్రువల్ కప్స్ అమ్మకాలు బెలాకు ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఒక్క కప్ 1800. అమ్మకాలు పై వచ్చిన లాభం తో పెద మహిళలకు వీటిని ఉచితంగా ఇస్తారు. ఈ ఆలోచనకు గాను ఇరాగుహ విశ్వవిద్యాలయం అందించే వార్నర్ ఫెలోషిప్ అందుకొంది.

ఇంకాస్తా పొడుగ్గా

ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు కాస్త పొడవుగా కనిపించాలి అంటే కొన్ని ఫ్యాషన్ టిప్స్ చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. హై వైస్టెడ్ ప్యాంట్లు షర్టులు సూట్లు వేసుకుంటే కాళ్లు పొడవుగా అనిపిస్తాయి. జీన్స్ లేదా పాంట్స్ వేసుకుంటే మ్యాచింగ్ షూస్ వేసుకోవాలి. అలా ఒకే రంగు ప్యాంట్లు షూస్ వేసుకోవటం వల్ల రంగు కలిసిపోయి చూడగానే పొడుగ్గా అని పిలుస్తారు. పాలాజో ప్యాంట్లు లేదా లూజ్ బాటమ్ ప్యాంట్లు మీదకు హిల్స్ మంచి ఎంపిక. చిన్న ప్రింట్లు […]

ఐస్ క్యూబ్స్ తో అందం

ముఖానికి రాసుకునే బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం త్వరగా గ్రహించేందుకు ఐస్ క్యూబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రీమ్ లేదా సీరమ్  వాడిన తర్వాత ముఖాన్ని ఐస్ క్యూబ్స్ తో రుద్దితే చర్మం మెరుస్తుంది. ఐస్ క్యూబ్ వస్త్రంలో చుట్టి దానితో ముఖం పైన ఉన్న నల్లని వలయాలు మీద సున్నితంగా రుద్దితే ఫలితముంటుంది. మేకప్ వేసుకొనే ముందు ఐస్ క్యూబ్ లేదా ఫాక్స్ వాడితే మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. పొడిబారి పగుళ్లు వచ్చి నా పెదవుల పైన […]

ఇవి సన్ స్క్రీన్ వంటివి

ఈ సీజన్ లో వచ్చే ద్రాక్ష పండ్లు తప్పకుండా తినండి అంటారు బర్మింగ్ హోమ్ లోని అలాఖమ్ విశ్వవిద్యాలయ నిపుణులు.. ఇవి అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి అంటారు. ద్రాక్షలో వుండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లనీ, మధుమేహం వంటి వ్యాధుల నుంచే కాదు,సూర్యరశ్మి లోని వేడికి చర్మ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయట ఈ విషయాన్నీ నిర్ధారించుకొనేందుకు ద్రాక్ష తినక ముందు తిన్న తర్వాత కూడా చర్మ కణాల పైన యు.వీ కిరణాల ప్రభావం […]

గంగాధరేశ్వరుడు

ఈ మహా శివుని విగ్రహం ఎత్తు 58 అడుగులు నాట్యం చేస్తున్నట్లు కనబడే జటాజూటం తో చతుర్భుజాలతో వీరుడిలా గా కనిపించే ఈ మహా దేవుడి విగ్రహం. కేరళ లోని విళింజంలోని అళిమాల శివాలయ ప్రాంగణంలో ఉండే గంగాధరేశ్వరుడు విగ్రహం దేశంలోనే ఎత్తయిన శివుడి మూర్తిగా పేరు పొందింది ..అళిమాల బీచ్ ఒడ్డున కాంక్రీట్ తో ఈ విగ్రహాన్ని ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన సి. ఎస్ దేవతారాధన తన 26 ఏళ్ల వయసులో […]

జుట్టు పెరుగుతోంది

బరువు తగ్గించడం కోసం ఆహారంలో భాగంగా తింటున్న అవిసె గింజలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ప్రొటీన్లు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పీచు యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నా అవిసెల నుంచి  నూనె తీస్తుంటారు. ఈ నూనె జుట్టు కుదుళ్ళకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఊడదు ఇందులోని విటమిన్లు జుట్టు వేగంగా పెరిగేందుకు తోడ్పడతాయి. అవిసెలు తలలో రక్త ప్రసరణ వేగం పెంచి జుట్టు […]

ఎండలో కాసేపు ఉంటే

ఉదయం ఎండలో పదిహేను నిముషాలు ఉండగలిగితే ఎవరికి వాళ్లు ఆరోగ్యానికి మేలు చేసుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండ కారణంగా చర్మం పై పొరలోని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గా మారి రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీనితో రక్తప్రసరణ మెరుగై బీపీ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు కాసేపు ఎండలో ఉంటే వారిలో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ స్రావం పెరుగుతుంది విటమిన్-డి కేవలం ఎముకల కే కాదు ఇన్సులిన్ స్రావాన్ని పెంచటం ద్వారా మధుమేహం […]

కోట్ల కొద్దీ ఫ్యాన్స్

సత్యవతి రాథోడ్ అనటం కంటే మంగ్లీ గానే ఆమె అందరికీ తెలుసు. ఆమె పాడితే కోట్లకొద్దీ వ్యూస్ వర్షం కురుస్తుంది. ‘సారంగదరియా’ ‘బూమ్ బద్దల్’ ‘రాములో రాములా ఎండికొండాలు ఏలేటోడా అడ్డ బొట్టు శంకరుడా పాటలు. ఆమె యూట్యూబ్ లేకపోతే నేను లేను తెలుగు ప్రజల ఆదరణ నేను ఊహించలేనంత ఇప్పుడు ఈషా ఫౌండేషన్ వారి పిలుపుతో శివుడి పాటలు పాడే అవకాశం వచ్చింది. ప్రపంచ వేదిక పైన నేను సద్గురు తో కలిసి పాడగలిగే అవకాశం […]

పట్టు వంటి చర్మం

కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు మొహాన్ని మెరిపిస్తాయి..మీగడ బ్లూబెర్రీస్ తో ఇంట్లోనే చేసుకునే ఈ ప్యాక్ చర్మాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది. రెండు బ్లూబెర్రీ లు ఒక స్పూన్ తాజా మీగడ అర టీస్పూను ముల్తానీ మట్టి తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. బ్లూ బెర్రీలు మెత్తగా చేసి అందులో మీగడ వేసి కలిపి పేస్టులా చేయాలి. ఇందులో ముల్తానీ మట్టి కలిపి చిక్కగా తయారు చేసుకుంటే ప్యాక్ సిద్ధం. ముందుగా ముఖానికి ఆవిరి పట్టుకొని శుభ్రంగా […]

ఆరోగ్య రంగంలో ఫిరోజా కొఠారి

అనాటమైజ్‌ 3డి అనే సంస్థ ద్వారా రోగి అవయవాలను పోలిన త్రీడి నమూనాలను రూపొందిస్తోంది ఫిరోజా కొఠారి శస్త్రచికిత్స సమయాన్ని తగ్గించేందుకు త్రీడీ నమూనాలు వైద్యులకు ఎంతో ఉపయోగపడతాయి. బయోటెక్నాలజీ లో ఇంజనీరింగ్ చేసింది ఫిరోజా. వైద్యులతో కలిసి రోగుల అవసరాలకు అనుగుణంగా ఇమ్ ప్లాంట్స్ ప్రస్థటిక్స్ఆర్థోటిక్స్ వంటి వాటిని తయారు చేయిస్తోంది ఫిరోజా. రెండు వందల ఆస్పత్రి లతో కలిసి పనిచేస్తూ వందలాది సర్జరీ లకు కావలసిన నమూనాలను తయారు చేయించింది. గత సంవత్సరం ఫోర్బ్స్ […]

పువ్వులాంటి తాజాదనం

హఠాత్తుగా ఏ పార్టీకో అటెండ్ కావలసి వస్తే అలసట లేకుండా తాజాగా  కన్పించాలని అనిపిస్తే ఈ  టిప్స్ పనికొస్తాయి. పాలలో దూది ఉండను ముంచి మొహం శుభ్రం చేసుకుంటే తాజాగా కనిపిస్తారు. రెండు స్పూన్ల పాలు స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి రాసి ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే  చర్మం తేమగా ఉంటుంది .రెండు స్పూన్ల క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి ముఖానికి రాసుకుని ఆరిపోయాక శుభ్రం చేస్తే ముఖం తాజాగా కళగా […]

రోజు శుభ్రం చేయాలి

చాలా చిన్న విషయాలే అశ్రద్ధ చేస్తే అనారోగ్యాలకు తెర తీసినట్లే అవుతోంది.రోజు దువ్వుకునే దువ్వెనే కదా అని అలా వదిలేస్తాం. కానీ ఆ దువ్వెన మీద ప్రతిరోజు దుమ్ముధూళి ఆయిల్ పేరుకుపోతూ ఉంటుంది .ఎంత శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి ఆ దువ్వెనతో తల దువ్వు కొన్నా  ఫలితం ఏముంటుంది.దువ్వెన మురికి కాస్త తలలో వచ్చి చేరుతుంది అందుకే దువ్వెనలు హెయిర్ బ్రష్ లు మేకప్ బ్రష్ లు అన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

అపోహలు వద్దు 

గర్భనిరోధక మాత్రలు విషయంలో లేనిపోని సందేహాలు లేకుండా ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలని, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. కాంట్రాసెప్టిక్ పిల్స్ తో బరువు పెరుగుతారని అనుకుంటారు ఈ  మాట నిజమే అంటారు డాక్టర్లు. వీటిల్లో వుండే ప్రొజెస్టిక్ ఆకలిని పెంచుతుంది. అందుచేత ఈ మాత్రలు వాడే మహిళలు ఆహార శైలి పైన ఒక కన్నేసి ఉంచాలి. వీటివల్ల బిడ్డకు ఎలాంటి అల లక్షణాలు కలగవు గర్భం దాల్చిన తొలి రోజుల్లో […]

టాప్ కోట్ చాలా ముఖ్యం

నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు చెదరకుండా ఉండాలంటే ముందుగా కోట్ వేసుకోవాలి, నెయిల్ పాలిష్ ఆరిన తరవాత కోటు వేసుకుంటే అది పొరలాగా ఏర్పడి గోళ్లు అద్దంలా మెరుస్తూ ఉంటాయి. ఏ రకం నెయిల్ పోలిష్ అయినా టాప్ కోడ్ తప్పనిసరి అలాగే రోజుకు రెండు సార్లు చేతులకు హాండ్ క్రీమ్స్ రాసుకుంటే గోళ్ల దగ్గర క్యూటికల్స్ దెబ్బ తినవు. గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి టాప్ కోట్ వేసుకొని ముందర బేస్ కోట్ అప్లయ్ చేయాలి ఇలా […]

శాశ్వత పరిష్కారం వ్యాయామమే

రుతుక్రమ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గేందుకు సాధారణంగా వేసుకునే మందులు కాకుండా వ్యాయామం ఎంచుకో మంటున్నారు అధ్యయనకారులు. మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ శాశ్వత పరిష్కారం కావు. ఇలాంటి ఇబ్బందులు గలవారిలో రెగ్యులర్ గా థ్రెడ్ మిల్ పైన నడవమని సలహా ఇస్తే శాశ్వత పరిష్కారం లభించింది. అని ఒక రిపోర్ట్ కొన్ని వందల మంది పై చేసిన  రీసెర్చ్ ఆధారంగా ఏదో ఒక సమయంలో ప్రతిరోజు మహిళలు వ్యాయామాలు […]