Thursday, 08 Oct, 2026

సౌకర్యమే ఫ్యాషన్

సాగరికా ఘాట్గే జాతీయస్థాయి హాకీ ప్లేయర్ అలాగే ‘చక్ దే ఇండియా’ ద్వారా నటిగా ప్రశంసలు అందుకుంది.మోడల్ గా ఫ్యాషన్ లైఫ్ స్టైల్ రంగంలో రాణించింది. క్రీడల్లోనే కాదు వ్యాపారంలో కూడా ఆమె అద్భుతాలు సృష్టించింది.అకుటి బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారం లోకి ప్రవేశించింది సాగరిక .2023లో ఈ  బ్రాండ్ లాంచ్ అయింది.కొల్హాపూర్ రాజవంశానికి చెందిన సాగరిక టీం ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ను వివాహం చేసుకుంది. కొల్హాపూర్ రాజభవనం లోని తోటలోని పూలను సాగరిక తల్లి ఊర్మిళ చీరల మీద చేత్తో డిజైన్ చేసేది.అవన్నీ సాగరికకు చాలా నచ్చాయి.ఈ కాన్సెప్ట్ తో ఆమె స్థాపించిన బ్రాండ్ విజయవంతం అయింది.ఫ్యాషన్ అంటే కొత్త బట్టలు కొనటం కాదు తరతరాలకు అందించగలిగిన ఒక డిజైన్.మన వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోయే డ్రస్సు ఏదైతే అదే స్టైల్ అవుతుంది.మా అమ్మ అందమైన డ్రస్సుల మీద మరింత అందమైన పూల డిజైన్లు పెయింట్లు చేసేది.అవి అచ్చం పూదోటలను ప్రతిబింబించేవి. అందుకే  నా బ్రాండ్ అకుటి డిజైన్లు అందాల పూలతోటలు గా ఉంటాయి అంటుంది సాగరిక.. లైఫ్ స్టైల్ రంగంలో ఈ బ్రాండ్ ఒక ప్రత్యేకమైన పేరుతో విజయవంతంగా నడుస్తోంది.

Leave a Reply