Wednesday, 07 Oct, 2026

ఇలా చేస్తే ఫ్రెష్ గా ఉంటాయి

మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు నిల్వ చేసే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి  ఇంటికి తీసుకురాగానే కడిగితే ఆ తేమ కు ఆకుకూరలు కుళ్లిపోతాయి. కనుక కడగకుండా నిల్వ చేయాలి.వండుకునే ముందు మాత్రమే శుభ్రం చేసుకోవాలి.తెచ్చిన ఆకుకూర కట్టలు విప్పి అందులో కుళ్ళిన, దెబ్బ తిన్న ఆకులు, గడ్డి వంటివి తొలగించాలి.ఒక్క చెడిపోయిన ఆకు  ఉన్నా మిగతా ఆకులు కూడా పాడైపోతాయి. కొత్తిమీర పుదీనా కాడలు కొద్దిగా కత్తిరిస్తే చాలు. అలాగే పాలకూర తోటకూరల అడుగున ఉన్న మట్టిని దులిపి నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎయిర్ టైట్ కంటైనర్లలో అడుగున కిచెన్ పేపర్ లేదా ఒక టవలు పరిచి దానిపై ఆకుకూరలు పెట్టి పైన టిష్యూ పేపర్ ఉంచితే ఇవి ఆకులకు తగిలే తేమని పీల్చుకుని ఎక్కువ రోజులు ఆకుకూరలను ఫ్రెష్ గా ఉంచుతాయి.ఇంత జాగ్రత్తగా ఫ్రిజ్ లో ఉంచితే వారం రోజులు పాటు పచ్చగా ఉంటాయి వాటిని వాడుకోవచ్చు.

Leave a Reply