విద్య వికాసానికి మూలం
లుపిన్ లిమిటెడ్, లుపిన్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతల సారధిగా బాధ్యత తీసుకున్న తుషార శంకర్ గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడిన వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.ఆమె చేసిన సేవ ఇండియా విమెన్ లీడర్స్ జాబితా 2026 సామాజిక మార్పు విభాగంలో ఆమెను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది.లుపిన్ ఫౌండేషన్ కు , ఫార్మస్యూటికల్ సంస్థ లుపిన్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి, ఫౌండేషన్ కి ఆమె అధికారిగా ఉన్నారు.పేద పిల్లల జీవితాల్లో అభివృద్ధికి మూలం విద్య ఒక్కటే అని నమ్మిన తుషార శంకర్ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక డిజిటల్ విద్య ను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. లుపిన్ ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో ఉచిత తాగునీటి వ్యవస్థలు,ఆరోగ్య సేవలు వంటి ప్రాజెక్టులను చేపట్టి విజయవంతంగా అమలు పరుస్తున్నారు.దశాబ్దాల తరబడి ఆమె చేసిన సేవకు ఫలితంగా హురూన్ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకుంది.
