మూడోసారి గోల్డ్ మెడల్
2014లో గ్లాస్గో లో ఏ బరువుతో కామన్వెల్త్ లో మొదటిసారి పాల్గొన్న 2026 లో కూడా అదే బరువుతో పాల్గొని హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది మీరాబాయి చాను. ప్రపంచ వేదికల మీద పత కాలు సాధిస్తున్న మీరాబాయి మణిపూర్ లోని నోంగ్‌పోక్ కాక్చింగ్ గ్రామంలో పుట్టింది. పేద కుటుంబంలో పుట్టిన మీరాబాయి చిన్న వయసులోనే ఎంతో బలం చూపెట్టగలిగేది.ఎంతెంతో బరువులు మోసేది ఈమె బలాన్ని ఒక కోచ్ గుర్తించి చిన్న వయసు నుంచే ఆమెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.గత 12 ఏళ్లుగా మీరాబాయి తన శరీర బరువును 48 కిలోలు ఉండేలా మెయింటైన్ చేస్తూ పోటీలో పాల్గొంటూ ఉన్నది.ఒక మిల్లీమీటర్ తేడా వచ్చిన పతకం చేజారి పోతుందని ఆమె కచ్చితంగా తెలుసు మహిళలకు వయసు పెరిగే కొద్దీ బరువు పెరగటం సహజం కానీ మీరా మాత్రం పోటీకి సాధన తో పాటు, బరువులు ఎత్తే సాంకేతికతను నేర్చుకోవడం తో పాటు,శరీర బరువును అదుపులో పెట్టడం కూడా నేర్చుకుంది.ఆహారం, సాధన, మానసిక బలం మీరాబాయి ఫిట్నెస్ కి మూడు సూత్రాలు.
