Thursday, 24 Sep, 2026

తొలి మహిళా ట్రక్ డ్రైవర్ నేహా

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మొట్టమొదటి ట్రక్ డ్రైవర్ నేహా ఠాగూర్. ఆమె వ్లాగర్ కూడా. మండి జిల్లా ఖడ్ల గ్రామానికి చెందిన నేహా గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే చండీగఢ్ లో ఎయిర్‌హోస్టెస్‌ గా శిక్షణ తీసుకుంది .అయితే  కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో తన ఆసక్తిని వాణిజ్య ట్రక్కుల డ్రైవింగ్ వైపు మళ్ళించింది. 2023 లో 21 ఏళ్ల వయసులో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొందింది నేహా. తండ్రి రాజేష్ ఆధ్వర్యంలో ట్రక్కు నడపడం లోని మెలకువలు నేర్చుకుంది .ట్రక్ డ్రైవర్ గా మారిన తర్వాత నేహా డ్రైవింగ్ అసైన్మెంట్లు స్థానికదారులకే పరిమితమై ఉండేవి. తర్వాత దూర ప్రయాణాలు ఇతర రాష్ట్రాలకు ట్రక్కు  నడపడం మొదలు పెట్టింది ఈరోజు ఆమె 16 టన్నుల భారీ ట్రక్కు తో భవన నిర్మాణ పదార్ధాలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు కూడా తరలించ కలుగుతుంది కఠినమైన పర్వత మార్గాల్లో దేశవ్యాప్త అంతర్రాష్ట్ర రహదారుల్లో ఆమె ధైర్యంగా  తన ట్రక్కును నడిపిస్తుంది. తన ప్రయాణాలు తన అనుభవాలను వ్లాగింగ్ చేస్తూ లక్షలకొద్దీ వ్యూయర్లను సంపాదించుకుంది .యూట్యూబ్‌లో ఆమెకు నాలుగున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ,ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనిమిది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Leave a Reply