రోటి బాక్స్ ఒక అంతర్జాతీయ బ్రాండ్
రొట్టెలు చపాతీలు తయారు చేసే ఒక ఆల్ ఇన్ వన్ రోటి మేకింగ్ స్టేషన్ ని తయారు చేసి రోటి క్వీన్ గా పేరు తెచ్చుకుంది సోఫియా చౌదరి. బ్రిటన్ కి చెందిన సోఫియా 12 ఏళ్ల పాటు ఒక కార్పొరేట్ రంగంలో పని చేశాక ఈ రోటి మేకింగ్ మిషన్ తయారు చేయాలని దానితో వ్యాపారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.తన తల్లి నాయనమ్మ కోసం తండ్రి తయారు చేసి ఇచ్చిన ఒక చెక్క పెట్టె ఆమెకు ఒక నమూనాగా ఉపయోగపడింది.నాలుగేళ్ల పాటు ఈ రోటి బాక్స్ తయారీ కోసం శ్రమ పడ్డాక ఆమె అనుకున్న డిజైన్ తయారయింది. సామాజిక మాధ్యమాల్లో ఈ రోటీలను తయారు చేయడం పోస్ట్ చేస్తే అది కాస్తా వైరల్ అయి వ్యాపారం పుంజుకుంది .ఆమె వీడియోలకు 30 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి ఆమె రోటి క్వీన్ గా పేరు తెచ్చుకుంది ఆ తర్వాత తాను తయారు చేసిన రోటి బాక్స్ ను రోటి వేర్ గా మార్చి 6 రకాల ఉత్పత్తులను తీసుకొచ్చారు సోఫియా.ఈరోజు ఈ రోటి వేర్ అంతర్జాతీయ బ్రాండ్.
