Thursday, 24 Sep, 2026

అందాల ఆమ్రపాలి ఆభరణం

వినాయక చవితి నాడు నీతా అంబానీ ఆమ్రపాలి భారతం అని ఒక భారీ నగ ధరించింది.ఆ నెక్లెస్ విభిన్న ఆభరణాల మిశ్రమం గా మెడ చుట్టూ ఆక్రమించిన ఈ నెక్లెస్ చుట్టూ దక్షిణ భారతీయ నత్తులు,బిల్లాలు,జుమ్మర్లు, చాంద్బాలీలు మధ్య మధ్యలో ముత్యాలు, జాతి రాళ్ళు ఇలా వేర్వేరు దశాబ్దాలకు చెందిన ఈ ఆభరణాలన్నీ ఒకే ఒక నెక్లెస్ గా రూపొందించారు. ఆమ్రపాలి జ్యువెలర్స్ సీఈవో తరంగ ఆరోరా గ్రూప్. ఈ నెల గురించి ఈ ఆభరణం తయారీ గురించి తరంగ్ ఆరోరా మాట్లాడుతూ ఈ తరహా నెక్లెస్ ని డిజైన్ కాగితం మీద గీయటం కుదరదు .వేర్వేరు ఆభరణాలు ఒక దగ్గర పరిచి అవన్నీ అందంగా ఇమిడిపోయి ఆకట్టుకునే రూపాన్ని వచ్చేవరకు వాటి స్థానాలను మారుస్తూ డిజైన్ చేశాను.ఈ నగ మూడేళ్ల సమయం పట్టింది 14 మంది కళాకారులు విడివిడి నగలు అన్నిటిని కలిపి నెలల తరబడి కష్టపడ్డారు. కుందన్ పనితనం ముత్యాల దారాలు పోల్కే మీనా కారీ పనితనంతో ఈ నగకు చాలా అందం వచ్చింది అన్నారు  తరంగ్ అరోరా.

Leave a Reply