లింక్ ఎకో గ్రీన్ వ్యవస్థాపకురాలు సాత్విక తాడూరు ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో మాస్టర్ చేసిన సాత్విక చారిత్రక ప్రదేశాల్లో విగ్రహాలు, అలనాటి కట్టడాలు ఎందుకు వందల ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నాయో రీసెర్చ్ చేసి సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ తో సరికొత్త కట్టడాలు సృష్టించింది. బయోఫిలిక్ డిజైన్ తో మనిషికి ప్రకృతికి మధ్య దూరాన్ని తగ్గించే విధంగా ఉంటాయి సాత్విక ప్రాజెక్టులు. సొంతంగా పరిశోధన చేసి పిల్లర్స్ లేకుండా మూడంతస్తులు నిర్మించ గలిగే అంత బలమైన ఇటుకలు తయారు చేసే చూపించారు.













