ఇంటెలిజెన్స్ బ్రాంచ్ తొలి మహిళా చీఫ్ బడుగుల సుమతి ప్రతిష్టాత్మకమైన మెరిటోరియల్ సర్వీస్ మెడల్ అందుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా లో కలుగొట్ల గ్రామానికి చెందిన సుమతి తన 25 ఏళ్ల సర్వీస్ లో పోలీస్ శాఖ లో శాంతి భద్రతలు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సి ఐ డి ఎస్ ఐ డి వంటి కీలక విభాగాల్లో పని చేశారు.తెలంగాణలో ఎస్ ఐ బి చీఫ్ గా తొలి మహిళ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు పురుషులకు మాత్రమే పరిమితంగా ఉన్న కొన్ని శాఖలలో ప్రస్తుతం మహిళలు తమ సత్తా చూపిస్తున్నారు వారిలో బడుగుల సుమతి కూడా ఒకరు.














