సాహూ సినిమాలో నటించిన శ్రద్ధ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ లో కోట్లమంది ఫాలోవర్స్ ఉన్నారు.తన సినిమా కబుర్లు,తినే భోజనం తను పెంచే చిన్న కుక్క పిల్ల గురించి కూడా తన ఫాలోవర్స్ కు చెబుతుంది శ్రద్ధ.9.15 కోట్ల ఫాలోవర్స్ తో దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో మూడో స్థానంలో ఉంది శ్రద్ధ.శ్రద్ధ కంటే ముందు వరుసలో క్రికెటర్ విరాట్ కోహ్లీ,గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఉన్నారు బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురు గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రద్ధ మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నది.













