జార్ఖండ్ కేడర్ కు చెందిన సంపత్ మీనా సి. బి. ఐ అడిషనల్ డైరెక్టర్ 1994 బ్యాచ్ ఆఫీసర్ మహిళల సమస్యలు మానవ హక్కుల పై కృషి చేసిన గుర్తింపు పొందారు.తండ్రి భర్త ఇద్దరు ఐపిఎస్ ఆఫీసర్లే. ఢిల్లీలో దా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న సమయంలో పిల్లల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. జార్ఖండ్ లో 700 మంది పిల్లలను తల్లిదండ్రులను చేరుకునేలా చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆమె చేసిన ధైర్యసాహసాలకు పురస్కారాలు దక్కాయి. తప్పిపోయిన పిల్లలను కనిపెట్టి వారికి పునరావాసం కల్పించే ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లారు.













