కాంబోడియాలో మనలాగే సంవత్సరాదిని జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఈ పండగ జరుగుతుంది. తొలిరోజు మహా సంక్రాంతి అని పిలుస్తారు పంట చేతికి వచ్చే సమయం ఇది .రెండవరోజు ఇళ్లు శుభ్రం చేసుకుని పానీయాలు తయారు చేసి వరాక్ వనాదత్ పేరుతో పెద్దలను పూజిస్తారు. మూడవరోజు వీర లాంగ్ సాక్ పేరుతో బుద్ధిని పూజ ఉంటుంది దీపాల వెలుగులు అలంకరణలు ఆటపాటలతో పండగ అట్టహాసంగా జరుగుతుంది.కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే పండగ ఇది.














