వస్త్ర వారసత్వం లో భాగమైన కాంతా కొట్టుకు కుట్టు ను ప్రపంచ స్థాయికి తీసుకుపోయి అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో అందుకున్నది మౌమిత బసక్. కలకత్తా విశ్వవిద్యాలయం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాలేజీలో మాస్టర్ చేసింది. కళాకారిణిగా తన ప్రత్యేకత తనకు ఉండాలని కోరిక తో బెంగాల్ కాంత కొట్టును ఆర్ట్స్ తో కలిపింది ఇది అతి ప్రాచీనమైన కుట్టుపని వ్యర్ధ వస్త్రాలు, టీ కాఫీ రంగులతో ఆమె యువతుల ఆరోగ్యం విద్య వంటి అంశాలతో కళాకృతులు సృష్టించింది లండన్ లోని ప్రసిద్ధ రిచార్డ్స్ స్టాలిన్ గ్యాలరీ లో ఆమె చిత్రాలు ప్రదర్శనకు ఉన్నాయి ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఆమె పేరు చోటు చేసుకున్నది.













