హోప్ షూట్స్ అనే చెట్ల చిగుళ్ళు కిలో లక్ష రూపాయలు.ఈ హోప్ చెట్లు చిగుళ్ళు చూసేందుకు పొరలు పొరలుగా ఉంటాయి వగరుగా చిరు చేదుగా ఉండే ఈ కాయగూరను సలాడ్స్ సూప్ లో పచ్చళ్ళు బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ కాయగూరలో అరుదైన యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. వీటిని చేత్తో అతి సున్నితంగా చెట్టు నుంచి కోస్తారు. ఎక్కువ కాలం నిలువ ఉండవు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన కూరగాయల్లో ఇది ఒకటి వీటిని మన దేశంలో కూడా పండిస్తున్నారు.














