Sunday, 29 Nov, 2026

వేప పుల్ల వాడొచ్చు.

ఎన్నో రకాల అనారోగ్యాలకు నోటి లోని బాక్టీరియా కారణం అంటున్నారు డాక్టర్స్. అందుకే రెండు సార్లు తప్పని సరిగా బ్రష్ చేయాలని చెప్పుతున్నారు. ఆహారం తీసుకున్న ప్రతి సారీ నోటిని నీళ్ళతో కడుక్కోవాలంటున్నారు. ఉదయం, రాత్రి పడుకునే ముందర తప్పని సరిగా బ్రష్ చేయాలి. ఉప్పు, తేనె, పసుపు, పాలు , నిమ్మరసం కలిపి పేస్టు చేసుకుని దాని తో పళ్ళు తోముకుంటే పళ్ళ పై పేరుకున్న పసుపు రంగు పోతుంది. పూర్వపు పద్దతిలో వేప కొమ్మ […]

వంటరిగా ఎందుకు?

శరీరానికి కష్ట కదలిక ఉండాల్సిందే. ఏ సీజన్ అయినా వ్యాయామం చేయవలసిందే. వర్షంలో బద్దకించి చలికి చిరాకేసి వ్యాయామం పక్కన పెడితే నష్టమే. అయితే ఎవరికి వాళ్ళు చేసే వ్యాయామాలు కాస్త కష్టం అనిపిస్తే ఎక్కువ మంది తో కలిసి చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తాజా పరిశోధనలో వ్యాయామం నలుగురితో కలిసి చేస్తే వత్తిడి తగ్గిపోతుంది. ఒంటరిగా కంటే గ్రూప్ గా కలిసి పని చేసినప్పుడు మానసికంగా, శారీరకంగా భావోద్వేగ పరంగా మెరుగైన పరిస్థితులు  ఉంటాయని పరిశోధనల […]

బాధ్యత ఇద్దరిదీ.

నీహారికా, సగం సమస్యలు సాటి మనిషిని మనిషిగా చూడకపోవడం వాళ్ళ వస్తున్నాయంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్స్. ప్రతి క్షణం కష్టపడే ఇల్లాలిని ఎంత కష్టపెడుతున్నావు, నీకేమైనా సాయం కావాలా అన్న ఆదర పూర్వకమైన మాటలు దొరక్క డిప్రెషన్ లో పడిపోతుందిట. నిజానికి  ఏ ఇల్లాలూ తాను చేస్తున్నది శ్రమ అనుకోదు. శ్రమ చేయడం చిన్న తనంగానూ భావించదు. కానీ భర్త తన శ్రమను గుర్తించకపొతేఅ. పురుషులు  ఈ పాయింట్ ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. ఏదయినా ఇంటి నుంచి వచ్చి […]

జీర్ణశక్తి కి సోంపు.

సోంపు ను చీజ్, బ్రెడ్, వెజిటేబుల్ వంటకాలు విశేషంగా వుపయోగిస్తారు. నాన్ వెజ్ కూరల్లో సోంపు పొడి వాడతారు. కేక్స్, బిస్కెట్స్ బ్రెడ్ లో ఉపయోగించే ఈ సొంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది చక్కని ఎనర్జీని ఇవ్వగలదు. పోషకాలు, యాంతాక్సిడెంట్లు డైటరీ ఫైబర్, ఎసెంషియల్ కాంపౌండ్స్ వున్నాయి. కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలున్నాయి. విటమిన్ A,E,C లతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా వున్నాయి. కీళ్ళ నొప్పులు తగ్గేందుకు సోంపు నూనె […]

అన్ని రుచులు దొరకాలి.

చిన్న పిల్లలు సాధారణంగా అన్నం తినేందుకు తల్లుల్ని చాలా విసిగిస్తారు. కొన్ని ఇష్టం లేదంటారు. ఎంత బతిమిలాడినా తిననంటారు. అలాంటప్పుడే పిల్లల విషయంలో ఒక నిశ్చయానికి వచ్చేసి ఇక ఆ పదార్ధం పిల్లలకు పెట్టడం మానేస్తారు. అదే చాలా తప్పు అంటున్నారు. చైల్డ్ సైకాలజిస్టులు.  వాళ్ళకి  అన్ని రుచులు అందాలి. ఇంట్లో తినే ఆహారంలో చక్కటి చేరుస్తూ వుంటే వాళ్ళకు రుచి తెస్తుంది. కొన్ని వద్దంటే వాళ్ళకు నచ్చదని మీరు డిసైడ్ చేయకండి. పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, […]

తీరిగ్గా ఉన్నారు.

ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ ఆయన భార్యతో కలిసి వంట చేసుకుంటున్న ఫోటో ఇవ్వాళ సోషల్ మీడియాలో లైకులు కొట్టేస్తుంది. ఆయన ఇచ్చిన ఫేస్ బుక్ లో మునిగి తేలుతూ ఎన్ని జంటలు క్షణం తీరిక లేకుండా ఉన్నారో కానీ, వాళ్ళిద్దరూ మటుకు సంతోషంగా తీరిగ్గా వంట చేస్తున్నారు. ఇది చుసాకనైనా, కాసేపు ఫేస్ బుక్ వాటాల పెట్టి ప్రపంచంలో జంట లందరూ ఈ ప్రపంచం వైపు చుస్తే బావుండు.

అతి మాములు తల్లిని

పిల్లలు బయటికి విలితే ఇంటికి తిరిగి వచ్చే వరకు నాకు భయమే ఫోన్ లో ఎక్కడున్నారు అని అడుగుతూనే వుంటాను అంటోంది. బాలీవుడ్ అగ్ర నటి శ్రీదేవి. ఇప్పుడున్న సామాజిక పరిస్ధితిలో పిల్లలకు భద్రత లేని తల్లిగా ఫీలవ్వుతాను. జాహ్నవి, కుషి ఇద్దరికీ ఇంటికి ఏ సమయానికి వచ్చేయాలో రూల్స్ ఉంటాయి. సరిగ్గా ట్రిమ్ కి వచ్చేసారు. నేనేమీ హైటెక్ అమ్మను కాదు. సాధారణమైన తల్లిగానే వాటి తో మసులుకొంటాను అంటోంది శ్రీదేవి.  పిల్లలను సినిమాల్లోకి తీసుకు […]

చక్కనమ్మ ఆమే.

ప్రియాంక చోప్రా  ఇంకో ఘనత సాధించింది. హల్లీవుడ్ లో సత్తా చూపిస్తున్న ప్రియాంక, ఆసియాలోనే మోస్ట్ సెక్సియస్ట్ ఉమన్ గా నిలిచింది. లండన్ కు చెందిన ఈస్ట్రన్ ఐ అనే పత్రిక ఆన్ లైన్ పోలే నిర్వహించి రూపొందించిన జాబితాలో ప్రియాంక మొదటి స్థానం లో ఉంది. ప్రియాంక ఈ ఘనత అందుకోవడం ఇది ఐదో సారి. ఆ విషయం గురించి ట్వీట్ చేస్తూ  ఈ విషయం లో మా అమ్మా నాన్నలకు కు థాంక్స్ చెప్పాలి. […]

ఇద్దరు ఒక్కటిగా.

బారసాల నుంచే ఇవాల్టి రోజుల్లో తల్లీ పిల్లల మాచింగ్ ఫ్యాషన్ సందడి మొదలవ్వుతుంది. ఈ మధ్యను ఐశ్వర్యారాయ్, ఆరాధ్యా కలిసి ఒకే రకం డ్రెస్సుల్లో కనిపించి సందడి చేసారు. బెనారస్, పట్టు, గద్వాల్ రకాలు కుచ్చిళ్ళు కుట్టేసి మంచి ఆకృతిలో కనిపించేలా చేసే శీరా గౌన్ లు నేలను టేక్ అనార్కలీలు ఈ మాచింగ్  ఫ్యాషన్ కు బావుంటాయి. ఇద్దరూ ఒకే వర్ణం వేర్వేరు ఛాయల్లోను, కాంబినేషన్ రంగుల్లో ఒకే డిజైన్ తోనూ ఈ డ్రెస్సు లు […]

రాతి రుచులు కావాలా?

మనిషికి ఎప్పుడూ అన్వేషణ పైన మమకారం పోదు. ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా ఇంకా ఎదో కావాలన్న తపన మనిషిలో లేకపోతె ముందుకు పడే అడుగులు ఏనాడో ఆగేవి. అలా వచ్చినవే హాట్  రాక్  ఫైరింగ్. నున్నటి  బండరాయి పైన వంట చేయడం,  ఆమ్లెట్, చపాతీ కాల్చుకోవడం. ఇప్పుడో ఆటవిక కాలంలో ఎర్రని ఎండలో వేడెక్కిన రాయి పైన మాంసం వేడి చేసుకు తిన్నా పూర్వీకులకు నమస్కారం పెట్టి ఆధునిక షెఫ్ లు రాక్ రెస్టారెంట్స్ కు శ్రీకారం […]

లండన్ ఫ్యాషన్ వీక్ లో రాఖీ శర్మ.

హిమాయత్ నగర్ లోని ఐఎస్ఐఎఫ్ డి ఫ్యాశాన్ డిజైనింగ్ శిక్షణా సంస్ధలో శిక్షణ పొందుతున్న 20 ఏళ్ళ రాఖీ శర్మా తన ఫ్యాషన్ కలక్షన్ ను లండన్ ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించే అవకాశం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 500 ఈ పోటీలో వుంటే అందులో 24 మంది డిజైనర్ల ఎంపిక కాగా వారిలో రాఖీ శర్మ ఒకరు మెస్మరైజింగ్ మెటాలిక్ పేరుతో సృష్టించినా తన కలక్షన్ కోసం రెండు నెలలు ఆలోచించానని, ఆరు నెలల పాటు శ్రమ […]

ముక్కల ఫ్యాషన్ వచ్చేసింది.

చిన్న చిన్న అట్ట ముక్కలను కట్ చేసి భారతదేశం బొమ్మగా అతికించడం, లేదా పిల్లలకి ఈ ముక్కలు ఇచ్చి రకరకాల జంతువులని ఆకారాలని సృస్టించ మానడం ఒక ఆట. దీన్నె జిగ్ సా ఫజిల్  అంటారు. ఈ ఫాజిల్ పీస్ డిజైన్ లను వస్త్రాలలో ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. ఈ జిగ్ సా ఫ్యాషన్ లో గౌన్లు, టాప్ లు, ఫజిల్ పెండెంట్స్, బ్రాస్ లెట్స్, సాక్స్ లు షాల్సూ తయారు చేసారు. ఫుడ్ ఫ్యాశాన్ లో కుడా […]

తప్పులు చేసేది మనమే.

నీహారికా, మనం అంటూ లేని ప్రేమాతో పిల్లల పట్ల చాలా అపచారాలు చేస్తూ వస్తున్నాం. మనం పిల్లలు ఇప్పుడు సక్సెస్ తోనే ఉండాలని ఆశించడం పెద్ద తప్పు కాదు. కానీ ఒక్కో సారి అది అసాధ్యం కావచ్చు కుడా. ఇప్పుడు సక్సెస్ నే తెచ్చి పెట్టగలరా పసివాళ్ళు. ఒక్కో సారి ఫెల్యూర్స్ కుడా వస్తాయి. కష్ట చదువులో వెనక బదిపోగానే వాళ్ళను మిగతా వాళ్ళతో పోల్చి చూసి కించ పరుస్తాం. అదే మనం చేసే మొదటి తప్పు […]

నోరూరే ఐస్ క్రీమ్ బర్గర్.

ఐస్ క్రీమ్ పైన ఇష్టానికి తిరుగే లేదు. ఎవ్వర్ గ్రీన్ ఇది. అందుకే ఐస్ క్రీమ్ వెరిటీల పైన చేసే ప్రయోగాలకు అంటూ లేదు. అలా ఇప్పుడు వచ్చింది ఐస్ క్రీమ్ బర్గర్. చికెన్ ఫ్యాటీ, చీజ్ వెరైటీ  బర్గర్ లు రుచి చూసే వుంటాం. కానీ ఈ ఐస్ క్రీమ్ బర్గర్ విదేశాల్లో   విసేషంగా  పాప్యులర్ అయి ఇప్పుడే ముంబాయ్ లోని రోలింగ్ పిన్ డెసర్ట్ షాప్ లో దిగింది. 365 రూపాయిల ఖరీదు చేసే ఈ డెసర్ట్ బర్గర్ […]

నీటి తోనే ఉపవాస ప్రయోజనం.

పండగలకీ, పబ్బాలకీ ఉపవాసాలు చేస్తూనే ఉంటారు. వారంలో దేవుళ్ళ పేరున కొన్ని రోజుల ఉపవాసం చేసే వాళ్లున్నారు. మరి ఉపవాసం తర్వాత ఏం తింటే ఉపవాసం వల్ల అందె ప్రధాన ప్రయోజనం అంటే జీర్ణ వ్యవస్ధ శుభ్ర పడుతుంది? ఉపవాసం వెంటనే ఏం తింటే శక్తి సమకూరుతుందీ అంటే, ఆహారం చాలా తేలిగ్గా అరిగి పోవాలి. తాజా పండ్లు, పండ్ల రసాలు తప్పని సారి. ఈ రసంలో పంచదార ఉండకూడదు. పచ్చని కూరగాయలు, ఆకుల తో చేసిన […]

ఆస్పత్రి కట్టించిన పని మనిషి.

నాలుగిళ్ళలో పని చేస్తూ కూరగాయలు అమ్ముతూ ఒక హాస్పితల కట్టించడం, అదీ ఏ ఆధారం లేని ఒక మహిళ ఒంటరి పోరాటం చేసి నిర్మించిందంటే నమ్మగలరా? కలకత్తాలోని హన్స్ పుకుర్ గ్రామంలోని హ్యుమానిటీ హాస్పిటల్ ను కట్టించింది సుభాషిణీ మిస్త్రీ నలుగురు పిల్లల తల్లి 23 ఏళ్ళ వయస్సులో భర్తను పోగొట్టుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక అతను మరణించడం తోనే తనలాంటి వారి కోసం, ఒక కొడుకుని డాక్టర్ చదివించింది. సుభాషిణి చిన్న […]

గురి చూసి కొడితే గెలుపే.

వెదురు కోసి బాణం చేసుకుని  సాధన చేసిన దీపికా కుమారి ఆర్చరీ క్రీడలో భారతీయ ప్రతిష్టను అంతర్జాతీయ స్ధాయికి తీసుకుపోయింది. ఈ మధ్యనే బ్యాంకాక్ లో జరిగిన ఇండోర్ ఆర్చరీ వరల్డ్ కప్, స్టేజ్ 2 లో కాంస్య పతాకం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఒక్క పురుష ఆర్చర్ కుడా క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళనే లేదు. జార్ఖండ్ లోని రాంచి లో జన్మించిన దీపిక తండ్రి శివా నారాయణ్ మహా తో అటో రిక్షా డ్రైవర్, […]

150 ఏళ్ళ ఆచారం బ్రేక్.

ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి మనకు 405 ఏళ్ళ పాటు కొనసాగిన ఆచారానికి ఇద్దరు ఆడపిల్లలు ముగింపు పలికారు యూపీ లోని వారణాసి లో తులసీ దాస్ అఖీరా అనే స్త్రీలకు ప్రవేశం లేని మల్ల యుద్ధం శిక్షణా కేంద్రం నడుస్తుంది. పదేళ్ళుగా అక్కడ మల్ల యుద్ధంలో శిక్షణ ఇమ్మని అడుగుతున్నారు. నందితా, ఆస్ధాన్ అనే ఇద్దరమ్మాయిలు. వాళ్ళు ఒప్పుకోలేదు . నిరుపేదలైన ఒక ప్రైవేట్ సిక్షకుడి దగ్గర మల్లయుద్ధం నేర్చుకున్నారు. చివరికి ఈ ఏడాది ఆగస్టు […]

ఇవన్నీ వేస్ట్.

ఎనర్జీ బార్ ను మినీ మిలీస్నాన్ అంటున్నారు. ప్రోటీన్, ఫైబర్ ను అందించే శక్తివంతమైన డోస్ గా దీన్ని వర్ణించారు కానీ పంచదార, చక్కరల తో కలిపి చేసే ఈ ఎనేర్జీ బార్ వల్ల పెద్ద ఉపయోగం లేదని ఇప్పటి అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఇందులో 200 కాలరీలు, ఏడు గ్రాముల షుగర్, మూడు గ్రాముల ఫైబర్ వుందని కవర్ పైన రాసి ఉంటున్న ఇవి ప్రతి రోజు మినీ మీల్ గా తింటే మటుకు పంచదార, పాలు, […]

ఎక్కువ తినక్కర్లేదు.

మనిషి ఆరోగ్యంగా వున్నప్పుడు ఎంత కావాలంటే అంట తినచ్చని అనుకోవడం అపోహ. ఎక్కువ తినడం వల్ల కాలరీలు ఖర్చు కాక అనారోగ్యం వస్తుంది. ఇది గర్భంతో వున్న వాళ్ళకి వస్తుంది. కడుపులో పెరిగే బిడ్డ, తల్లి కోసం ఇంకెంతో తినాలని చెప్పుతున్నారు. కొంచెం ఎక్కువ తీసుకుంటే తప్పేమీ కాదు కానీ, ఎంతైనా కరెక్ట్ కాదు. కాలరీలు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి. కాల్షియం, బీకాంప్లక్స్ లోని పోలిక్ యాసిడ్ గర్భాధరణ సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కూరగాయలు, […]