ఎప్పటికీ చెరగని అందం

ఎప్పటికీ చెరగని అందం

ఎప్పటికీ చెరగని అందం

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పటికీ క్వీన్ ఆఫ్ కేన్స్ గానే అభినందనలు పొందుతున్నారు. ఆ వేదిక అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ డిజైనర్ల పనితనానికి ఒక గుర్తింపు. ఫ్రాన్స్ లోని కేన్స్ చిత్రోత్సవం లో ఈ సంవత్సరం ఐశ్వర్య ధరించిన ‘లుమినారా’ గౌన్ ప్రముఖ డిజైనర్ అమితా అగర్వాల్ 1500 గంటల సేపు ఎంతో మంది కళాకారులతో కలిసి రూపొందించారు అది ప్రకృతి శక్తి లాగా కనిపిస్తుంది. గాఢమైన నీలి రంగులో భుజాలపై రెక్కలతో ఐశ్వర్య ఈ గౌనులో సజీవమైన శిల్పం లాగా కనిపించింది.చేతితో చేసిన క్రిస్టల్ మెయిన్ ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్ మరో ప్రత్యేకత. గౌన్ పైన వెలుగు పడగానే లిక్విడ్ కదులుతున్నట్లు ఆప్టికల్ ఇల్యూషన్ సృష్టించారు ప్రపంచ వేదిక పైన ఐశ్వర్య ఈ గౌన్ లో క్వీన్ లాగే ఉన్నారు.