వ్యాపార విజయం
భారతదేశంలో సౌందర్య ప్రేమికులు ఎంతో ఇష్టపడే కాస్మోటిక్ బ్రాండ్ షుగర్ కాస్మోటిక్స్ ను స్థాపించిన మహిళా పారిశ్రామికవేత్త వినీత సింగ్. ఐఐటి మద్రాస్ ,ఐఐఎం అహ్మదాబాద్ వంటి సంస్థల్లో చదువుకొని కోట్లాది రూపాయల జీతాన్ని తిరస్కరించి కోట్ల టర్నోవర్ గల షుగర్ కాస్మాటిక్స్ కి రూపుదిద్దింది వినీత సింగ్. ఆమె తండ్రి తేజ్ సింగ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బయోపిజిసిస్ట్ గా పని చేశారు. వినీత సింగ్ చిన్న వయసు నుంచి వ్యాపారం చేయాలని ఆలోచనతో ఉండేది .మొదట్లో భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి ఫ్యాబ్ బ్యాగ్ అని బ్యూటీ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ప్రారంభించింది .మహిళలు ప్రతినెలా కొంత డబ్బు చెల్లిస్తే వాళ్ళకి అంతర్జాతీయ బ్రాండ్ల శాంపిల్స్ బ్యాగ్ ని ఇంటికి పంపుతారు .మహిళలు వాటిని వాడి చూసి పూర్తి ప్రోడక్ట్ కొనుగోలు చేయవచ్చు. ఈ వ్యాపారం నడుస్తుండగా 2017 లో వినీత కౌశిక్ షుగర్ కాస్మోటిక్స్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.లిప్ స్టిక్ ఐ లైనర్, మ్యాట్ లిప్ స్టిక్ లతో ఆన్లైన్ లో ఈ బ్రాండ్ అమ్మకాలు ప్రారంభించారు .ఈ కాస్మెటిక్స్ ని సరికొత్త ప్యాకేజింగ్ తో లాంచ్ చేశారు.నైకా,లైఫ్ స్టైల్ వంటి రిటైల్ స్టోర్స్ లో తమ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో షుగర్ కాస్మటిక్స్ కంపెనీ లో ఎంత మందో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. వందల కోట్ల రూపాయల ఫండింగ్ తో ఈ కంపెనీ భారత దేశంలోని టాప్ త్రీ బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా ఉంది. ఇది వ్యాప్ వినీత సింగ్ వ్యాపార విజయ గాధ..
