Saturday, 08 Aug, 2026

వేల మందికి శిక్షణ

వ్యవసాయ కూలీగా పని చేసిన 29 ఏళ్ల ప్రియా నటరాజన్ కు చిన్నతనంలో చదువుకునే అవకాశమే రాలేదు.తమిళనాడు రాష్ట్రం వడలూరు లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రియా బాగా చదువుకుని స్వశక్తితో నచ్చిన రంగంలో స్థిరపడాలనాకున్నది. కానీ కుటుంబం ఆమె ఆశ తీర్చలేదు.పెళ్లి చేశారు కానీ ఆ పెళ్ళి విఫలమైంది. అటు తర్వాత డిగ్రీ చేసి పోటీ పరీక్షలు రాసింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది .విద్య విలువలతో తెలుసుకొని దాన్ని పేద పిల్లలకి అందించాలని ఆశయంతో 2022 లో అవ్వయ్యార్  ఐఏఎస్ అకాడమీ ప్రారంభించింది. 73 మంది విద్యార్థులతో మొదలైన ఈ అకాడమీలో ఇప్పటివరకు ఎనిమిది వేల మందికి పైగా పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందారు. 3000 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, ఏ దిక్కు లేని వారు, ఒంటరి మహిళలు ,సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలకు ఉచితంగా ఇక్కడ శిక్షణ ఇస్తారు  వ్యవసాయ కుటుంబాల వారికి 25% ఫీజు లో రాయితీ ఉంటుంది. పేద కుటుంబాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు కూడా ఉచితంగా ఇస్తారు. చదువుకోవాలనే  తన ఆశ తీరకపోయినా, దూరవిద్యలో ఎన్నో డిగ్రీలు సాధించి ఈ అకాడమీ స్థాపించి ఎంతోమంది విద్యార్థులకి విద్యాదానం చేస్తోంది ప్రియా నటరాజన్.

Leave a Reply