మౌంట్ క్వీన్ లక్పా

మౌంట్ క్వీన్ లక్పా

మౌంట్ క్వీన్ లక్పా

నేపాల్ కు చెందిన 51 ఏళ్ల లక్పా షెర్పా 51 ఏళ్ల వయసులో 11వ సారి ఎవరెస్ట్ ఎక్కి అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన మహిళ గా తన పేరు పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టారు.షెర్పా గ్రామానికి చెందిన లక్పా తండ్రి పర్వత రోహకులకు మేలుకువలు నేర్పే గైడ్. ఆయనతో కలిసి ఎవరెస్టు ఎక్కుతూ ఈ పర్వతాలపై మక్కువ పెంచుకుందామే 2000 నుంచి 2006 లోపల ఆరుసార్లు తర్వాత 2016, 2017, 2018, 2022 ల్లో విజయవంతంగా ఎవరెస్ట్ అధిరోహించారు లక్పా షెర్పా. తాజాగా మే 17వ తేదీన ఒక క్లైంట్ కు గైడ్ గా వ్యవహరిస్తూనే పదకొండవ సారి ఎవరెస్ట్ ఎక్కి తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగ రాసుకున్నారు ఆమెను మౌంట్ క్వీన్ అంటారు.