ఈ డ్యూటీ ఏ దేశంలో అయినా ఒకటే
ఇప్పటికీ అన్ని దేశాల్లో ఉమెన్ పోస్ట్ మెన్ లు పని చేస్తూనే ఉన్నారు అమెరికాలో 30 నుంచి 40 శాతం వరకు మహిళా పోస్టు ఉమెన్ లు ఉద్యోగాలు చేస్తున్నారు.1845లో మేరీ ల్యాండ్ లోని ఛార్సుల్ టౌన్ లోని పోస్ట్ ఆఫీస్ లో సారా బ్లాక్ అనే ఉద్యోగి అమెరికాలో పనిచేసిన మొదటి మహిళ.ఇప్పటికీ పోస్ట్మాన్ బాధ్యతలు ఏ దేశంలో అయినా ఒకటే వర్షాలు కురుస్తున్నా, తీవ్రమైన ఎండ ఉన్నా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి.అరిజోనాలోని సుపాయ్ అనే ఇండియన్ రిజర్వేషన్ లో ఉన్న సుమారు 3000 మందికి కంచర గాడిదల మీద ఉత్తరాలు తీసుకుపోయి అందజేస్తారు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 1982 నుంచి పోస్ట్ మెన్ లు ఇళ్లలోని మనుషులను భద్రత కోణంలో కూడా కనిపెట్టి చూస్తుంటారు.ఎవరైనా వృద్ధులు కొన్నాళ్ళు ఉత్తరాలు తీసుకోకపోతే వారికి ఏమైందో తెలుసుకుంటారు. ఇంట్లో దొంగలు పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా పోస్ట్ మాన్ ల ద్వారానే బయటికి వస్తూ ఉంటాయి. ఇప్పటికీ పోస్ట్ మాన్ అనేది ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగం.
