అనవసరంగా కొనకండి
కొంతకాలం ఏమీ కొనకుండా ఉండటం ఒక ఆర్ట్ అంటున్నారు అధ్యయనకారులు. దాని పేరే నో బై ఛాలెంజ్ .కనీసం ఒక ఆరు నెలల పాటు అవసరమైన వస్తువులు అంటే ఆహారం, మందులు తప్ప ఇతర వస్తువుల పైన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం ఈ ఛాలెంజ్ ఉద్దేశం. కొత్త బట్టలు, మేకప్ సామాగ్రి అనవసరమైన వస్తువులు ఆన్‌లైన్ షాపింగ్ లు వస్తువులు కొనకూడదు. 2025 లో అమెరికాలో వెయ్యి మందికి పైగా పెద్దలపై నిర్వహించిన ఒక సర్వేలో 42 శాతం మంది ఇప్పటికే ఈ నో బై ఛాలెంజ్ లో పాల్గొంటున్నామని చెప్పారు. దీని వెనుక ప్రధాన కారణాల్లో పొదుపు పెంచుకోవడం,అప్పులు తగ్గించుకోవడం,అలాగే అవసరమైనవన్నీ కొని ఇల్లంతా నింపటాన్ని తగ్గించుకోవడం అంటున్నారు. కొత్తదనాన్ని కోరుకునే యువతరం ఏదో ఒకటి ఆన్‌లైన్ లో ఆర్డర్ పెడుతూనే ఉన్నారు. అవి అవసరమా అనవసరమా అన్న ఆలోచన లేకుండా ఈ వస్తువుల మీద పెంచుకుంటున్న మమకారాన్ని తగ్గించటమే ఈ ఛాలెంజ్ లక్ష్యం .కొత్త బట్టలు కొనకపోవడం,ఆఫర్లు చూసి కూడా యాపులు మూసేయడం అవసరం లేని వస్తువులు ఈసారి వద్దు అని కొనుగోళ్లకు కళ్లెం వేయడం ఈ ఛాలెంజ్ లక్ష్యం ఈ కొత్త ఛాలెంజ్ వల్ల లాభమే అంటున్నారు అధ్యయనకారులు.
