ఆమె పేరే సంచలనం
సిబిఐ ఆఫీసర్ సీమ పహుజ పేరు దేశవ్యాప్తంగా ఒక సంచలనం. బి.కామ్ చదివిన సీమ 1988లో ఏజెన్సీలో చేరారు 1993లో సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు 2013లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాకు పదోన్నతి పొందారు .2022 లో ఏ ఎస్ పి అయ్యారు .సీబీఐ లో విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు ఢిల్లీ లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక నేర విభాగంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు సీమ .హౌస్ స్టాండింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా 2007, 2018, 2021లో బంగారు పతకాలు గెలుచుకున్నారు. సిబిఐ లో ఆమె చేసిన విశిష్ట సేవలకు 2014లో పోలీస్ మెడల్ ప్రధానం పొందారు .నిందితులను పట్టుకోవడంలో కేసులు పరిష్కరించడం లో ఆమె ఎన్నో వినూత్న పద్ధతులు ఉపయోగిస్తారు. సున్నితమైన కేసులతో సహా క్లిష్టమైన క్రైమ్ కేసులు ఫోరెన్సిక్ సాక్ష్యాల దర్యాప్తులో ఆమెకు విశేష మైన అనుభవం ఉంది .2024లో కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన అత్యాచారం హత్య కేసు దర్యాప్తు బృందం లో సీమ సభ్యురాలుగా ఉన్నారు . ఉన్నావ్ అత్యాచార కేసు దర్యాప్తు లో కీలక పాత్ర పోషించారు .హత్రాస్ కేసులో 15 మంది సభ్యుల బృందం లో ఆమె కూడా ఒకరు హిమాచల్ ప్రదేశ్ లో గుడియా కేసు దర్యాప్తు బాధ్యత ను కూడా సిబిఐ సీమకు అప్పగించింది .తాజాగా బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు విచారణ బాధ్యత కూడా సీమా పహుజా చేతికి వచ్చింది.
