Wednesday, 05 Aug, 2026
పెండ్లి నిస్చియం అయ్యాక సామంత ఎప్పుడూ వార్తల్లోనే వుంటుంది. ప్రస్తుతం రాజుగారి గది-2 లో నటిస్తోంది. ఏడాది నుంచి కొత్తగా సినిమాలు ఎం చేయలేదు. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోవడంలో చాలా బోల్డ్ గా వుంటుంది. తన కెరీర్ లో ఇంత విరామం తీసుకోవడం ఇదే తొలిసారని, అయినా తనేం ఖాలీగా లేనని చెపుతుంది సామంత. చేతిలో పనేం లేకపోతె నాకు పిచ్చెక్కుతుంది. షూటింగ్ లో ఒక్క రోజు విరామం వున్న ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచించేదాన్ని. ఇన్నాళ్ళ సుధీర్ఘ విరామం ఎప్పుడూ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరపు సమయాన్ని నా మానసిక ఆనందం కోసం వెచ్చించాను. నా గురించి లోతుగా అలోచించుకునేందుకు ఈ సమయం తోడ్పడింది. సినిమాల బిజీలో ఎం పోగొట్టుకొన్నాను అదంతా సంపాదించుకొనే వీలు కలిగింది. ఇలా అప్పుడప్పుడు మనలోకి, మన కోసం మనం ప్రయాణం చేయడం చాలా అవసరం అంది సామంత. నిజమే ఇలాంటి బిజీ సెలబ్రెటీనోటి గుండా ఒక విరామంలో మన గురించి మనం ఆలోచించుకుని మన కోసం మనం సంతోష పడాలని వినవస్తే లాభమే. ఎక్స్ పర్ట్స్ కూడా ఇదే చెప్పారు. కాస్త విరామం తీసుకొమ్మని.

ఈ కొంచం నా సాయం.

స్టార్ ఇమేజ్ వచ్చాక ఆదాయ మార్గాలు  ఎన్నో వస్తాయి. మాల్స్  ప్రారంభోత్స వాలు, ఐటెం సాంగ్స్ , స్పెషల్ గెస్ట్ లు ఏ ప్రోగ్రాం లో పల్గొంన్నా  కనక వర్షమే. సామంత కూడా ఇప్పుడు అన్ని రకాల సంపాదనల్లోనుంచి కొంత ప్రత్యూష ఫౌండేషన్ కు ఖర్చు పెడుతుంది.ఈ ఫౌండేషన్ ద్వారా నా చేతనైనంత సేవ చేస్తున్నా   షాపింగ్ మాల్స్  ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు వచ్చే డబ్బులు ఫౌండేషన్ కు వెళ్ళిపోతుంది. అందులోనుంచి ఒక్క పైసా తీసుకొను. నా పారితోషకం లో నుంచి కొంత మొత్తం ఫౌండేషన్ కు వెళ్ళిపోతుంది. ఈ రోజు కష్ట పడిన డబ్బు తో పది మందికి అన్నం పెట్టుకున్న  భావన ఎంతో సంతృప్తి ఇస్తుంది. ఎదో ఇచ్చేసాం, వచ్చేసాం అంటే కుదరదు. అన్నీ  పనుల్ని దగ్గరుండి చూసుకోవడం తో ఎంతో ఆనందంగా వుంటుంది. నా సమయం లో కొంత దానికి కేటాయిస్తేనే ఎంతో చేయగలుగుతున్నా   అంటుంది సామంత. ఈ మాత్రం సహృదయం వుంటే ఎంతో మందికి కొత్త జీవితం ఇచ్చినట్లే.

 

Leave a Reply