WoW
ఆ సినిమా తమన్నా నే ఆకర్షణ
హీరోల పేర్లు చూసి సినిమాలకు క్రేజ్ పెరుగుతుందనీ అసలు హీరోల వల్లే బ్లాక్ బస్టర్లు అవుతాయని సాధారణంగా సినిమా వార్తలు చూస్తుంటాం. ఇప్పుడు అంత క్రేజ్ హీరోయిన్ తమన్నా ఐటెం సాంగ్ కు ఉందిట. ఈమె హీరోయిన్ గా నటిస్తే ప్రేక్షకులు ఆనందిస్తారనుకుంటే ఆడో కధ. ఇప్పుడు ఆమె ఐటెం సాంగ్ ఉన్నా చాలు ఆ సినిమాకు కనకవర్షం కురుస్తుందిట. హీరో విశాల్ నటించిన ఒక్కడున్నాడు సినిమాకు అదనపు ఆకర్షణ కోసం తమన్నా తో ఐటెం సాంగ్ […]
లక్స్ మోడల్స్ కు అవార్డుల తో సత్కారం
ముంబాయిలో లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ 2016 కార్యక్రమంలో లక్స్ తన మోడలింగ్ తారలను అవార్డులతో సత్కరించింది. నాటి తార షర్మిలా టాగోర్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కరీనాకపూర్ కు గ్లామర్ దివా అవార్డు, దీపికా కు ఐకానిక్ లుక్ అవార్డు ఇచ్చారు. పూజా హిగైకు బెస్ట్ డెబ్యు అవార్డు బహుకరించారు. లక్స్ మొట్టమొదట 1899 లో బ్రిటన్ లో ఒక లాండరీ షాప్ గా మొదలైంది. లక్స్ బ్రాండ్ ప్రచారంలో బ్లాక్ అండ్ […]
బీరు కనిపెట్టింది మహిళలే
బీరు తాగటం లేదా బీరు లాంటి ఉత్పాదనలు అమ్మే షాపులు ఇవన్నీ పురుషుల ప్రత్యేక ప్రపంచానికి చెందినవి. కానీ బీరు తయారుచేసింది దాన్ని ఉపాధిగా చేసుకుంది మహిళలే. మెసపొటేమియా మహిళలు మొదటి ఓ పదివేల సంవత్సరాలకు పూర్వం గుమ్మడి పండు చెరుకు పిప్పి అడవి తేనె తదితర వస్తువులతో ఇళ్లలో తయారుచేసుకునేవాళ్లట. ఆ ఆకాలంలో దాన్ని దేవత ప్రసాదంగా భావించి తీసుకునేవాళ్ళు. మహిళలు దాన్ని తయారు చేసి అమ్మి ఆ సొమ్ముతో ఇంటికి కావలిసిన వస్తువులు తెచుకునేవాళ్లట. […]
డిప్రెషన్ తగ్గించే డాన్స్
సంగీతానికి రుగ్మతల్ని దూరం చేసే శక్తి ఉందని ఇప్పటిదాకా ఎంతో మంది అధ్యయన కారులు చెప్పారు. ఇప్పుడు తాజాగా డిప్రెషన్ కు కారణం అయ్యే అనేక మానసిక సమస్యలు నృత్యం ద్వారా దూరమవైతాయంటున్నారు. క్లినికల్ డిప్రెషన్ చికిత్సలు సాధారణ థెరపీ తో నృత్యం ప్రత్యామ్నాయ చికిత్స అంటున్నాం. డాన్స్ కారణంగా డిప్రెషన్ నుంచి బయట పడటమే కాదు శారీరికంగా ఫిట్నెస్ తో ఉంటారంటున్నారు. డిప్రెషన్ బాధితులే కాదు సాధారణ ఆరోగ్యంతో ఉండేవారు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే […]
అందమైన టీ పువ్వు
ప్రకృతి చాలా విచిత్రాలు సృష్టిస్తోంది. అచ్ఛం గులాబీల్లా లేదా ఇంకాస్త అందంగా కనిపించే పులున్నాయి. వీటిని మన పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అవన్నీ ఓ తేయాకు మొక్కకి పూసే పువ్వులు. పట్టు రేకు లని తీర్చిదిద్దినట్లు కనిపించే పువ్వు కెమీలియా జపోనికా రకం. ఇక తేయాకు మొక్కగా కంటే పూల మొక్కగానే అభిమానిస్తారు. అలాగే రోజెస్ ఆఫ్ వింటర్. ఇదే తెలుపు ఎరుపు పసుపు వంగ పూవు రంగుల్లో వుండే తేయాకు మొక్క జపోనికా రకమే. ఇంత […]
డిజైనర్ కల్యాణ సామాగ్రి
ఈ రోజుల్లో అన్నీ డిజైనర్ వెరైటీస్ చివరకు పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ తో సహా నిశ్చితార్ధం నుంచి రెసెప్షన్ వరకు వాడే వస్తువులతో పాటు సారెలు హారతి పళ్ళాలు కొబ్బరిబొండాం ,కళాశాలు ,పీటలు , అన్ని రంగుల రాళ్లతో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు డిజైనర్ కొబ్బరి బొండాం పట్టుకుని పెళ్లి మాటకొస్తే లేసు దారాలతో అల్లిన వెండి చెంబుతో కాళ్లు కడుగుతారన్నమాట. పూలు, పండ్లు ,మిఠాయిలు, పసుపు ,కుంకుమ నగలు ఉంచిన ట్రేలు కూడా డిజైనర్ వే. […]
తలో చేయి వేస్తారు
సమాజం గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించడం, అవసరంలో ఉన్నవారికి సాయపడటం సామాజిక భాద్యత. కాకినాడలో ఉన్న కొందరు గృహిణులు ‘ తపన హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించారు. కొన్ని సంస్థలను కలిశారు. అక్కడ వుండే పిల్లలకు, టీచర్లకు ఎన్నో రకాల సాయాలు చేస్తారు. పిల్లల కోసం పుస్తకాలు కొంటారు, భోజనాలు పెడతారు. టీచర్స్ కు ఇంకొంత జీతం ఇస్తారు. మానసిక వికలాంగుల పాఠశాలకైతే చాలా అందిస్తారు. పది మందీ పది చేతులు వేసి వికలాంగులకు చక్రాల కుర్చీలు, […]
మొలకెత్తే కాయితాలు
టమాటో అండ్ కో కేరాఫ్ కృత్తికా పర్వాల్. ఈ కేరాఫ్ అనిపించుకోవటం వెనకొకరుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో పుట్టి పెరిగిన కృతిక అమెరికా లో ఎంబీఏ చేస్తూ సెమిస్టర్ లో భాగంగా కాగితంలో కాయగూరల విత్తనాలు ఇమిచ్చి ఆ పేపర్ వాడేశాక దాన్ని నేలలో నాటితే అందులోంచి విత్తనాలు మొలకెత్తించేలా చేస్తే ఆడో మంచి వ్యాపారం అవుతుంది కాయితం వేస్ట్ కాకుండా వుంటుందీ అనుకొందిట. ఈ ఐడియా కి ప్రొఫసర్స్ అభినందనలు తెలిపారు. ఇండియాకి తిరిగివచ్చి […]
ఒక మిషను రెండు లభాలూ
ఒక్కోసారి ప్రపంచం మరీ ముందుకు పరుగు తిస్తుందేమో. మనమే వెనకబడి ఉన్నాము అనిపిస్తుంది కొన్ని ప్రకటనలు, లేదా కొన్ని వస్తువులు చూస్తుంటే. మనుషుల జీవన వేగాన్ని బట్టి కొత్త డిజైనర్ వస్తువులు వస్తున్నాయి. తీరైన ఆకృతి కోసం జిమ్ కు పోవడం బద్ధకం. పోనీ బట్టలు ఉతకడం బద్ధకం. ఈ రెండు బద్దకాలు పోగోట్టేందుకు వచ్చింది ‘బివా’ అంటే బైక్, వాషింగ్ మిషన్ లో బట్టలు పడేసిఫెడలింగ్ చేస్తే లోపల మీషన్ వాటిని ఉతికేస్తుంది. ఎంత శుభ్రంగా […]
అరే……… ఎంత సులువు
కొన్ని బుల్లి బుల్లి వస్తువులే వంటింట్లో ఎంతో ఉపయోగ పడతాయి వీటి గురించి తెలియక పొతే ఎలాగోలా అవస్థ పడతామనుకోండి. ఉదాహరణకు గార్లిక్ చెస్ట్ నట్ పీలర్ చేతి వేళ్ళకు ఉంగరంలా తోడుగుక్కుని అల్లం పై చర్మం పల్చగా లాగేయోచ్చు కత్తి లాగా ఉపయోగ పడుతుంది. చేతులు మండ కుండా అల్లం పొట్టు వచ్చేస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి ఇంట్లో గ్రయిడ్ చేసుకోవాలంటే వెల్లుల్లి రెబ్బలు వలవడం పెద్ద చాకిరి. మ్యాజిక్ సిలికాన్ గార్లిక్ పీలర్ ఒక్క […]
కమిట్మెంట్ విషయంలో సమంత సూపర్
వంద కేజీల బరువు మోస్తూ హీరోయిన్ సమంత చేస్తున్న వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం. హీరోయిన్స్ అత్యంత ఫిట్ స్టార్ సమంత అంటున్నారు. ఆమె ఫేవరేట్ ఫిట్ నెస్ ట్రైనర్ రాజేష్ రామ స్వామి. ఏళ్ల తరబడి ఒకే రకమైన ఫీజిక్ మెయిన్ టైన్ చేయడంలో సమంత చాలా ఖచ్చితంగా వుంటుందీ అంటున్నాడీయన. వర్కవుట్ టైం కు రావటం జాగింగ్ ,స్ట్రెచింగ్ ఫ్యాట్ కంట్రోల్ కి సంబంధించిన వ్యాయామాలు చేయటం ఉపవాసాలు చేయకుండా లైట్ గా […]
నిద్ర కోసం ఈ సుగంధ మొక్కలు
పడక గదిలో కొన్ని రకాల మొక్కలుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుందని ఒక కొత్త పరిశోధన రిపోర్ట్ చెపుతోంది. సుగంధ మొక్కల నుంచి వచ్చే స్వచ్ఛమైన వాసనలు ఒత్తిళ్ల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఈ హౌస్ ప్లాంట్స్ సహజమైన ప్యూరీఫైర్స్ కూడా. లావెండర్ ను సబ్బులతో సేన్టేడ్ బట్టలు షాంపూల్లో సువాసన కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్క ఇంర్లో ఉంటే ఇల్లంతా సువాసనే. కేప్ జాస్మిన్ మొక్క న్యూరో ట్రాన్స్ మీటర్ పైన ప్రభావం చూపెడతాయి. నాసా […]
ప్రకటనల్లోంచి సినిమాల్లో కొచ్చిన మెహ్రీన్
చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ లోంచి ప్రకటనల్లో మెరిసిపోయి సినిమా రంగానికి వచ్చినవాళ్లే. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండి తెరకి పరిచయం అయినా మెహ్రీన్ పీర్ జదా కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే సినీ రంగంలో కాలుపెట్టిందని డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ ఇవన్నీ ఆమెకు పేరు తెచ్చాయి. ఇక అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క శర్మ నిర్మించిన ఫిల్లరీ కూడా విడుదలకు […]
వాళ్ళు మాములు పిల్లల్లా ఎదగాలి
పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి సంపద మాత్రమే కాదు. డబ్బు విలువ తెలియజెప్పి సొంతంగా సంపాదించేలా పెంచాలంటున్నారు. కెరీర్ పీక్ లోఉండగా అజయ్ దేవగన్ ని పెళ్లాడిన కాజోల్ కు ఇద్దరు పిల్లలు నైసా ,యుగ్. వాళ్ళని అజయ్ దేవగన్ కాజోల్ పిల్లలుగా సెలబ్రేటీలుగా ప్రపంచం ముందు పెట్టటం కాకుండా డిసిప్లిన్ తో స్ట్రిక్ట్ […]
మన అమ్మాయిల పేర్లతో గ్రహాలు
ఏదైనా రంగంలో తమదైన ముద్ర వేసిన వాళ్ళ పేర్లను నాసా కొత్తగా కనిపెట్టే గ్రహాలకు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ గౌరవం పొందిన వాళ్లలో ఇద్దరు భారతీయ యువతలున్నారు. పూణే కు చెందిన హంస పద్మనాభన్ పేరుతో పైన ఓ చిన్న గ్రహం పేరు హంస 21575. హంస అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన సైన్స్ ఫెయిర్ లో ఫిజిక్స్ లో అయస్కాంత శక్తికి సంబంధించిన కొన్ని అంశాల గురించి చెప్పిన విషయాలు […]
వాళ్ళిద్దరూ ఒకేలా
70 ఏళ్ళ ఇడి, ప్రోన్ కు పెళ్లి అయ్యి 52 సంవత్సరాలు. పెళ్ళి అయ్యాక ఇద్దరు ఒకే రకం డ్రెస్సులు ప్రతి రోజు వేసుకుందాం అనుకున్నారంట. ఇద్దరు కలసి బయటకు వెళ్ళినా బయట ఫ్రెండ్స్, బంధువులతో కలిసినా సేమ్ డ్రెస్ తోనే కనిపిస్తారు. ఈ విషయాన్ని 17 సంవత్సరాల వాళ్ళ మనుమడు ఆంటోని పోస్ట్ చేస్తే 38000 మంది షేర్ చేసారట. ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయి, నేషనల్ మీడియా ఇంటర్వ్యూ చేసిందట. ఆ భార్య […]
కొరియన్ల రాణి పుట్టిల్లు అయోధ్యట
దక్షిణ కొరియన్ల మొట్ట మొదటి మహారాణి హర్ వాంగ్ ఓక్ . ఈమెను సురిరత్న అంటారు. ఆవిడ పుట్టినవూరు అయోధ్యట. అందుకే ఏటా వందల కొద్దీ దక్షిణ కొరియన్లు మన దేశానికి వచ్చి ఉత్తర ప్రదేశ్ లో వున్న అయోధ్యను దర్శించి వెళుతుంటారు. ఈ మహారాణి అయోధ్యలో పుట్టి ఇక్కనుంచి క్రీ. శ 48 లో పడవ ద్వారా దక్షిణ కొరియా వెళ్లి దేవుడు చెప్పిన ప్రకారం అక్కడున్న సురో ని పెళ్లాడిందట. పది మంది పిలల్లకు […]
తొక్కలో పూల రెక్కలతో
కాదేదీ కవిత కనర్వం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ……….. అంటూ శ్రీ శ్రీ, కవితా వస్తువు ఏదైనా పర్లేదన్నాడు. ఆ శ్రీశ్రీ బాటలోనే ఈ అభినవ శ్రీశ్రీ ఎడ్గార్ ఆర్టిస్ట్. తినే పళ్ళు, వాటి తొక్కలు, కూరలు, ఆకు కూరలు, పక్షులు ఈ కలతో ఒకటేమిటి కనిపించే ప్రతిదాన్ని వాడేసి కొత్త కొత్త డ్రెస్ డిజైన్స్ తాయారు చేస్తున్నాడు. సగం బొమ్మ గిస్తాడు ఆ బొమ్మకు డ్రెస్ డిజైన్ వివిధ వస్తువులతో చేసేస్తాడు. ఎడ్గార్ అమెరికన్ ఫ్యాషన్ చిత్రకారుడు, […]
అచ్చులోంచి కేకొస్తుంది
ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వంట కాస్త తినటానికి విలుగానే వుంటుంది. యుట్యూబ్ ఓపెన్ చేస్తే అన్న కుకరీ ప్రోగ్రాంలే. చూసి చూసి అందరికి వంట వచ్చేసిందనుకుంటా. ఎలాగో ఇళ్ళల్లో వండుకుంటాం ఇక పిల్లల పుట్టిన రోజులు, పెళ్ళి రోజు, కొత్త సంవత్సరం లాంటి ప్రత్యేక దినాలోస్తే హాయిగా ఇంట్లోనే నిమిషాల్లో బేక్ చేసుకోండి అంటూ కేక్ మౌల్డ్స్ కూడా వచ్చాయి. అచ్చం బేకరీల్లో వివిధ రూపాల్లో పిల్లలకి ఇష్టమైన కేక్స్ ఉన్నట్లే. కేక్ మౌల్డ్స్ లో అల్యూమినియం […]
కండరాలల శక్తిని పెంచే వ్యయామం ఇది
బ్రీతింగ్ వ్యయామాలు చేయడం వాల్ల రోజంతా ఉత్సాహంగా వుంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది మానసిక ఏకాగ్రత శరీర పటుత్వం పెరుగుతాయి. రక్తపోటు తగ్గుతుంది. డీప్ బ్రీతింగ్ వ్యయామంతో ఎండార్ఫన్స్ విడుదలై నొప్పుల నుంచి ఉపసమనం కలుగుతుంది. రిలాక్సేషన్ పెరుగుతుంది. లింఫాటిక్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. హాని కారక టాక్సిన్లు విడుదల చేసే ఈ వ్యవస్థ సరిగ్గా పని […]
