Wednesday, 05 Aug, 2026

ఇది మణిపూర్ మహిళల శక్తికి ప్రతీక

ఇమాకైథల్ అంటే మణిపూర్ భాషలో తల్లులు నిర్వహించే మార్కెట్ అని అర్ధం. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో వుంది చారిత్రాత్మక మార్కెట్ ఇమాకైథల్. ఇది మణిపూర్ మహిళల శక్తికి చిహ్నమే కాదు ఆసియాలోనే అతి పెద్ద మహిళల మార్కెట్. 16వ శతాబ్దంలో ఏర్పాటైనట్లు భావిస్తున్న ఈ మార్కెట్ లో 500 మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పెళ్ళయిన మహిళలు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించవచ్చు. ఇక్కడ వ్యాపారం కోసం మహిళలు కేవలం 40 రూపాయలు చెల్లిస్తే చాలు. వీళ్ళకి […]

ఇది ఫోటో గ్రాఫర్ అద్దం

సెల్ ఫోన్ తో సెల్ఫీస్ తీసుకోవడం ఇప్పటి ట్రెండ్ కదా. అప్పుడు మనం మనకి మనమే అందంగా ఫోటోలు దిగడం కష్టమే. ఈ బాధ లేకుండా సెల్ఫీ ఎన్ హాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజిన్ (సెల్ఫీ అన్నమాట) అనిపించే ఒక అద్దం వచ్చేసింది. ఈ అద్దం ముందు నిలబడి ఓ నవ్వు నవ్వితే అద్దమే ఫోటో తీసి దాన్ని ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తుంది. ఈ అద్దానికి కెమేరా తో పాటు మన ముఖాన్ని గుర్తించే […]

అవి మట్టిబొమ్మలు తినేవి కావు

ఎన్నో వింతలూ విశేషాలు చూస్తుంటే పిల్లలకీ పెద్దలకీ స్ఫూర్తిగా వుంటాయేమో అనిపిస్తుంది. ఇదిగో ఈ కనిపించే మీనియేచర్ మట్టి బొమ్మలు కూడా అలాంటివే. అమెరికాకు చెందిన కళాకారులు కిమ్ చేతిలో రూపం పోసుకున్న ఈ రకరకాల ఆహార పదార్ధాల రంగుల చాక్ పాన్టేల్స్ అతి సహజంగా అనిపించేలా తీర్చి దిద్దాడు. ఇంత బిన్నంగా అచ్చంగా నిజంగా ఆహారం అనిపించేలా చేయడం గొప్పే కదా. మనింట్లో పిల్లలతో, లేదా తీరికగా వుండే ఇళ్ళల్లో ఇలాంటివి ప్రాక్టీసు చేస్తే ఎంతో […]

రెడీ మేడ్ వంట గది

సింక్ ,ఒవేన్ , ఫ్రిజ్ వాటిలో పాటు వంట చేసుకునే సామాను మొత్తం ఇమిడిపోయే చిన్న వంట గది నిర్మించటం సాధ్యమా సరే పోనీ ఆ వంట గదిని అవసరం లేకపోతే అడ్డం అనుకుంటే మొత్తం మూసి పెట్టేసి వెనక్కి జరిపి వేయగలమా ? ఏ ఈప్రశ్నలకు సమాధానం ఒరిజనల్ సర్కిల్ కిచెన్ . 1.8 చదరపు మీటర్ల వైశాల్యంతో  స్తంభంలా  గుండ్రంగా నిలువుగా వుండే ఈ వంట గది  చూసేందుకు చిన్నగా ఉంటుంది కానీ ఇందులో […]

పిల్లల కోసం గౌను దుప్పటి

స్కర్ట్ బెడ్డింగ్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రకరకాల డిజైన్ ల దుప్పట్లు తయారుచేసారు. పిల్లలకి ఓ పట్టున ఏవీ నచ్చవు. వాళ్ళ కళ్ళలో అది ప్రత్యేకంగా తోచాలి. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో వాళ్ళు ఫెమింగో డాన్సర్ అనే దుప్పటి తయారు చేసారు. దుప్పటి పైన చక్కని డైన్  బూట్లతో ఓ పాపాయి పడుకున్నట్లు డిజైన్ చేసారు. ఐదారేళ్ళ పాపాయి ఇందులో దూరి పడుకుంటే ఎంతో చక్కని ఫ్రిల్స్ ఉన్న చుక్కల గౌను అందంగా ఉన్న […]

రైట్ అప్

ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు కట్టుకుని ఫోటోకి ఫోజు ఇచ్చారు కనెక్ట్ విత్ ది ఇండియన్ కమ్యునిటీ అనే కాంపెయిన్ కోసం వేరు ఇలా చీరెలు కట్టుకొన్నారు వీరిలో సీనియర్ మంత్రులు కొత్త ఎంపీలు ఉన్నారు.

కుంకుడు కాయతో ఎన్నో ఉపయోగాలు

కుంకుడు కాయలు తలస్నానానికి ఎప్పుడో వద్దన్నాం. షాంపూ తో కుంకుళ్ళు వెనుకబడ్డాయి. కానీ కుంకుడు రసం పట్టు నేత చీరలు మిలమిలా మెరిసేట్టు చేస్తుంది. కుంకుడు రసంతో కొత్త చీరలు ఉతికితే రంగుపోదు ,కొత్తదనం కూడా పోదు. అలాగే కుంకుడు రసంతో కాస్త వెనిగర్ కలిపి గాజు సామాన్లు కిటికీలు అద్దాలు తుడిస్తే మెరిసిపోతాయి. ఎన్ని క్లీనింగ్ రసాయనాలు వాడినా  స్నానాల గది మురికిగానే ఉన్నటుంటుంది. కుంకుడు రసంలో బేకింగ్ సోడా ఒక స్పూన్ బొరాక్స్ పౌడర్ […]

సెలబ్రెటీ హేయిర్ స్టయిలిస్ట్ అదూన్

బి బ్లూమ్ చెయిన్ సెలూన్ లను సక్సెస్ ఫుల్ గా  నిర్వహిస్తోంది. అదూన్ హేయిర్ స్టైలింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకుంది. హెయిర్ కట్ కు ఇంత బిల్డప్ వుంటుందా అనుకుంటే ఉంటుంది.  అదూన్ సెలబ్రెటీల పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. అమీర్ ఖాన్ సైఫ్ ఆలీ ఖాన్ ,అక్షయ్ ఖన్నా వంటి హేమ హేమీలకు పర్సనల్ గా సినిమాల్లో కూడా హెయిర్ స్టైలిస్ట్ ఈవిడే. ముఖం అందంగా కనపడాలనుకుంటే హెయిర్ కట్ స్టైల్ గా  ఉంటేనే అని […]

వజ్రం ఖరీదు 500 కోట్లు

వజ్రం అంటేనే విలువైనది. అందులోనూ 59.6 క్యారెట్ల బరువుంటే ఆసలలాంటి వజ్రం చాలా అరుదు. పైగా అది గులాబీ రంగులో మనసు దోచే లాగా వుంటే మరీ ప్రత్యేకం. 14 ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో దొరికిన ఓ పింక్ స్టార్ డైమండ్ వేలానికి వచ్చిన ప్రతీ సారీ రికార్డ్లు తిరగ రాస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం విలువ 500 కోట్లు. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన రత్నం ఇదే!

రంగులు మారే పూలు

మొక్కలకి రంగుల పూలు పూయటం చాలా సహజం . కానీ ఉదయాన్నే ఓ రంగులో విరబూసిన పువ్వు సాయంత్రానికి ఇంకో రంగులోకి మారిపోవటం విచిత్రం . అలాంటి పువ్వు  ముద్దమందారాల్లో ఒకటైన పత్తిమందారం . హైబిస్కస్‌ మ్యుటాబిలిస్‌ దీని శాస్త్రీయ నామం  .దీన్నే కాన్ఫడరేట్‌  రోజా అని , కాటన్‌రోజా మాలో అని పిలుస్తారు. ఈ పువ్వులు రంగుమారటానికి  సూర్యకాంతే  కారణం . తెల్లగా పూసిన పువ్వు కోసి ఫ్రిజ్‌లో పెడితే బయటకు తీసే వరకూ  తెలుపు […]

*** మనల్నీ మనం ప్రేమించుకొంటే సాధించగలం ***

రూపా మెహతా, 7 వర్కవుట్స్‌ ఫర్‌ 7 మూడ్స్‌ అనే విషయంపైన నలినీ మెథడ్‌ అనే పుస్తకం రాశారు. ఒక పనిపై శ్రద్ధ పెట్టాలంటే దానికి సంబంధించిన డ్రెస్‌ వేసుకోవాలి, సమయానికి బద్దకం లేకుండా లేవాలి. వేసుకొన్న డ్రెస్‌, లెగ్గింగ్స్‌తో మనలో మనకే ఒక సూపర్‌స్టార్‌ననే ఫీలింగ్‌ కలుగుతుందట. వ్యాయమం చేయాలంటే నేనంత చేస్తే అంత అందంగా ఉంటాను అనే ఆత్మ విశ్వాసాన్ని శరీరం మొత్తం నింపివేయాలి. అలాగే జిమ్‌కి వెళ్లే టైమ్‌ లేకపోతే ఇంట్లో చిన్న […]

నిమిషంలో కూరలు తయార్‌

మనుష్యుల అవసరాలను అనుసరించే కొత్త స్టార్టప్‌లు వస్తున్నాయి . ఈజీ కూర స్టార్ట్‌ చేసింది అల్లం పద్మ . ఈ వెబ్‌సైట్‌లో ఆర్డరిస్తే అక్కడున్న ఏరెసిపి ఎంచుకున్న ఆ కూరకు సంబంధించిన ముక్కలు దాన్లో వేస్తే  దినుసులు  అన్ని విడివిడిగా ప్యాక్‌ చేసి  ఆ కూర ఎలావండాలో  పాయింట్ల వారీగా తెలిపే ఓ కూడా అందులో పెట్టి పంపేస్తారు  .సెనగపప్పు , మినపపప్పు , రాజ్మాలాంటివి  వంటలో అవసరం  అయితే  వాటిని నానబెట్టి ఉడకబెట్టినవి కూడా  ప్యాక్‌లో […]

అన్ని వేళ్ళకూ ఒకే ఉంగరం

ఉంగరం అంటే వేలి చూట్టూ రింగు ఇంచక్కని రాయి అంతే కదా..! ఇవ్వాళ  ఫ్యాషన్‌ పాతదై పోయింది. ఉంగరాల స్టయిల్‌తో పాటు సైజు కూడా మారిపోయింది. ఒకే ఉంగరం రెండు మూడు వేళ్ళకు ఇంకోటి వేలి గోరు వరకు ఉంటే రెండేసి ఉంగకరాలు కలుపుతూ చేయిన్‌తో అసలు ఉంగరం కనబడకుండా అడ్జెష్టబుల్  స్టోన్‌ రింగ్స్‌ వచ్చాయి. మొత్తం చేయంతటికీ అలంకారంలాగా వేళ్ళ మొదలు నుంచి గోళ్ళ వరకు వజ్రాలు, రాళ్ళు డిజైన్‌లతోనూ వస్తున్నాయి. అన్ని వేళ్ళను కలుపుతూ […]

శాకాహారమూ బలవర్థకమే

శాకాహారం లో  ఎలాంటి బలం వుండదన్నది వట్టి అపోహ మాత్రమే నని ఇప్పటికే  పలు పరిశోధనలు రుజువు చేశాయి  . మాంసాహారానికి బదులుగా  పప్పు ధాన్యాలు  శరీరానికి కావల్సిన  మాంసకృత్తులు  ఇస్తాయి . పాలకు బదులు  సోయా పాలు ఇంకా శ్రేష్ఠం . ఆకు కూరలు , కూరగాయలు  ,మెలకెత్తిన విత్తనాల్లో విటమిన్లు  ఖనిజ లవణాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని , జంతు ఉత్పత్తుల్లో  ధీటుగా  ఈ శాకాహారం శరీర ధారుడ్యానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు […]

సంపాదన వుంటే ఆరోగ్యం ఉన్నట్లే

ఆరోగ్యంగా వుండటం  అంటే శరీరధారుడ్యం ఆరోగ్య స్థితుల పై ముడిపడి ఉంటుందని స్త్రీల ఆరోగ్య విషయంలో ఒక అంతర్జాతీయ సర్వే రిపోర్ట్ చెపుతోంది. ఆ అధ్యయనంలో పాల్గొన్న ఎక్కువ మంది స్త్రీలు మహిళలు గా వుండటం  అంటే ఆరోగ్యంగా ఫిట్నెస్ టోన్ అని చెపితే 50 శాతం మంది ఆర్ధిక అభద్రత తో వుండటం వాళ్ళ ఆరోగ్యంగా లేమన్నారు. 60 శాతం మంది మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్వహించే ఏ కార్యక్రమానికీ హాజరుకామన్నారు. కొంతమంది స్త్రీలు సంపాదనాపరులైతే […]

దీపావళి ఇందుకే

దీపావళి పండుగ కధ వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. లోక కంటకుడైన నరకుడు తన పుత్రుడైనా వాడిని వెనకేసుకు రాకుండా లోకాల్ని నాశనం చేయనీయకుండా స్వయంగా కన్న తల్లే అతన్ని సంహరించింది. నరకుడి మరణానికి కడుపు తరుక్కుపోయేలా దుఃఖపడింది. పిల్లలకి విదేశీ కధలు కాకుండా ఇలాంటి ధర్మాలను గురించిన కధలు వినిపించాలి. జిజియాబాయి  ఆలా చెప్పింది కనుకే శివాజీ ధర్మ నిష్ఠ కలవాడయ్యాడు. పిలల్లకు పండుగ వంకతో వాళ్ళు నీతిని గ్రహించే విషయాలు చెప్పాలి. దీపావళి జరుపుకుంటున్న […]

ఐస్ లాండ్ మహిళల అద్భుత పోరాటం

స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష లేని సమాజం సాధించాలంటే కనీసం 170 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఈ నివేదిక నేపథ్యంలో ఐస్ లాండ్  రాజధాని రేక్జావిక్  నగరంలో యధావిధిగా ఉదయం ఆఫీసులతో నిండిపోయాయి. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలైంది. వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా పని ముగించి రోడ్ల మెడకు వచ్చారు. ఎందుకంటే […]

స్పెషల్ కిడ్స్ కోసం నయీ దిశ

నయీ దిశ రిసార్ట్స్ సెంటర్ వ్యవస్థాపకురాలు ప్రాచిడియో . స్పెషల్ కిడ్స్ కు అండగా నిలబడాలన్నది ప్రాచీ కోరిక. స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లి తండ్రులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకే నయీ  దిశ  పోర్టల్. ఇంటలెక్చువల్ అండ్ డెవలెప్మెంటల్ డిజబిలిటీ  తో బాధపడుతున్న కుటుంబాల పేరెంట్స్ వారి పిలల్లకు సాధికారులుగా నిలబడేందుకు తల్లులకు పిల్లల గురించి కేర్ గివింగ్ సామర్ధ్యం పెంచేందుకు ఇలాంటి పిల్లలున్న కుటుంబాలకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పర్చేందుకు సాయపడుతుంది. ఈ వెబ్ సైట్ పేరు […]

మోడ్రన్ మోగ్లి టిప్పీ

పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల  టిప్పీ డెగ్రే ను కన్న తల్లితండ్రులు వైల్డ్ లైన్ ఫోటోగ్రాఫర్స్. ఈ పాప చిన్నతనం అంతా  చిరుతలు, మొసళ్ళు, పాములు, కప్పలు, మధ్యనే నడిచింది.  టిప్పీ 23 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ అమ్మనాన్న ఆ పాప జంతువుల మధ్య ఎలా ఆడుతూ పడుతూ వుందో  ఆ ఫోటోలలో  టిప్పీ ఆఫ్ ఆఫ్రికా పేరుతో  పుస్తకం వేసి గిఫ్ట్ గా ఇచ్చారట, ఏడేళ్లు వచ్చే […]

మిచెల్లీ ఒబామా ఇంట్లో దీపావళి సంబరాలు

వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో మిచెల్లీ ఒబామా దీపావళి దివ్వెను వెలిగించి పండుగ సంబరాన్ని ప్రారంబించారు. హిందూ, సిక్కు, జైన్ కమ్యూనిటీస్ నుంచి 240 మంది ప్రతిభా వంతులైన సెలబ్రెటీస్ లో ప్రెసిడెంట్ ఒబామా ఇల్లు నిజమైన దీపావళికి అద్దం పట్టినట్లు వుంది. మిచెల్లీ ఒబామా మాట్లాడుతూ ఇక్కడున్న మేధావులే నిజంగా ప్రపంచాన్ని వెలిగించే జ్యోతుల్లాంటి వాళ్ళు ఎంతో మంది యువతరానికి ఆదర్శ ప్రాయమైన మీతో ఈ సమావేశ మందిరానికి వెలుగొచ్చింది అన్నారామె. ప్రతి […]