Friday, 25 Sep, 2026

మొదటి సినిమాకే అవార్డు

మొదటి సినిమాకు నిర్మాతగా జాతీయ అవార్డు అందుకుంది నిహారిక కొణిదెల. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది.రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డును తీసుకుంది నిహారిక. ముద్ద పప్పు ఆవకాయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక ఒకపక్క నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తోంది.తను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి పెదనాన్న చిరంజీవి అంటుంది నిహారిక. ప్రతిభకి జెండర్ ఉండదని బలంగా నమ్ముతాను కాబట్టి అమ్మాయిల్ని మాత్రమే కథ రాయాలని, అమ్మాయిలు సినిమాలే తీయాలి అని అనుకోను. మంచి కథ ఎవరు చెప్పినా తీస్తాను. సినిమాల్లోకి రావాలనుకుంటున్నా అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే .ఆత్మగౌరవాన్ని వదులుకొని ఏది చేయొద్దు. ఎక్కడ రాజీ పడొద్దు ప్రతిభ ఉంటే చిత్ర పరిశ్రమలో ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది అంటుంది నిహారిక.

Leave a Reply