నేల మీద కూర్చుంటే మంచిది
పూర్వకాలంలో వంటగదిలో వరుసగా కుటుంబంలో అందరూ నేలపై పీటల మీద కూర్చుని భోజనం చేసేవారు మన పెద్దవాళ్ళు. తర్వాత డైనింగ్ టేబుల్ పద్ధతి వచ్చింది. కానీ నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నాయి అధ్యయనాలు.నేలపై కూర్చుని తినడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో కదలికలు పెరిగి దృఢంగా ఉంటాయి. కూర్చుని భోజనం చేస్తూ పదార్థాలను వంగి చేత్తో తీసుకుని మళ్లీ పైకి లేచి తినడం వల్ల కడుపులో జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది.. అధికమైన ఆహారం తీసుకోకుండా పొట్ట నుంచి మెదడుకి సంకేతం అందుతుంది.అలాగే గుండె నుంచి కింది భాగాలకు సక్రమంగా రక్తప్రసరణ జరుగుతుంది. జీర్ణక్రియలు మెరుగు పడతాయి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది.వెన్నెముక నిటారుగా మారుతుంది .భుజాలు వంగిపోకుండా ఉంటాయి.దీనివల్ల మెడ నొప్పి,నడుము సమస్యలు రావు. మోకాళ్లు మడమల్లోని కండరాలు సాగి శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
