Tuesday, 22 Sep, 2026

ఈ సబ్బులు మంచివే

నిమ్మ గంధం వాసన వచ్చే ఆర్గానిక్ హెర్బల్ సోప్ లు ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు  సాధారణంగా మనం వాడే సబ్బుల తయారీలో ఉండే  టోటల్ ఫ్యాటీ మేటర్ వీటిల్లో తక్కువగా ఉంటుంది.ఆయుర్వేద సిద్ధ యునాని ప్రమాణాల ప్రకారం తయారైన ఈ సబ్బులకి ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తింపు కూడా ఇస్తుంది.వ్యవసాయ ఉత్పత్తులతో చేసినవి సేంద్రియ సబ్బులు.మొక్కల సంబంధ పదార్థాలతో చేసినవి హెర్బల్ సోప్స్.ఈ సబ్బులను కోల్డ్  ప్రాసెస్ చేసి ఇతర ముడి పదార్థాలతో సహజంగా గట్టిపడేలా చేస్తారు.కొబ్బరి,బాదం,ఆలివ్ వంటి నూనెలు ఆముదం కోకో వంటివాటితో తీసిన వెన్న వంటి పదార్థాలను వీటి తయారీ కి ఉపయోగిస్తారు.వీటిలో  పసుపు,చందనం,సముద్రపు నాచు,ముల్తానీ మట్టి ఉపయోగించి,సబ్బు మృదువుగా వచ్చేందుకు మేక పాలు అలోవెరా తేనే వంటివి కలుపుతారు.ఈ సబ్బులు నిజమైన సేంద్రియ పదార్ధాలతో తయారైతే వాటికి భారత ప్రభుత్వం వారి లోగో లనే ఇస్తుంది.సున్నితమైన చర్మం గలవాళ్ళు ఈ సబ్బులు వాడటం మంచిది.

Leave a Reply