Tuesday, 22 Sep, 2026

38 ఏళ్ల పోరాటం

ఎప్పుడూ ఇంతే, ఎప్పటికీ ఇంతే!!!
హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన సుమిత్ర అనే ఒక మహిళను 1988 లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మహిళలు ఎల్ పిజీ సిలిండర్ లు మొయ్యలేరు రాత్రి వేళలో పని చేయలేరు అనే కారణం చెప్తూ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు.ఈ విషయం కోర్టుకు వెళ్లింది జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ఈ విషయం మీద తీవ్రంగా స్పందించింది.దీన్ని మహిళా గౌరవాన్ని అవమానించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుమిత్ర అనే ఈ మహిళ ఎన్నో ఏళ్లపాటు తన హక్కు కోసం పోరాడింది. మొత్తం 38 సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత ఆమె రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నాక సుప్రీంకోర్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మీద లింగ వివక్షకు తావిచ్చినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 12 లక్షల జరిమానా విధించింది.మహిళలు ప్రతిరోజు ఇళ్లలో సిలిండర్లను మారుస్తూనే ఉంటారు.ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇలాంటి లింగ వివక్ష చూపించటం స్త్రీలను అవమానించడమే అని కోర్టు వ్యాఖ్యానించింది. సుమిత్ర 38 ఏళ్ళు పోరాడి ఈ 12 లక్షలు మర్యాదని గెలుచుకుంది.

Leave a Reply