Tuesday, 22 Sep, 2026

ఈ బ్యాండ్ లో అందరూ వృద్ధులే

81 ఏళ్ల “దాంగ్ ఇన్ రాంగ్” 2007లో తొలిసారిగా గిటార్ నేర్చుకోవడం మొదలు పెట్టింది. భర్త మరణించడంతో జీవితం మీద ఆశ నశిస్తున్న సమయంలో సీనియర్ యూనివర్సిటీ లో గిటార్ తరగతుల్లో చేరింది డాంగ్ .ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సంగీతాన్ని ఆమె సీరియస్ గా తీసుకుంది. గిటార్ నేర్చుకోవడం తో పాటు పాటలు రాయటం వాటికి బాణీలు సమకూర్చటం నేర్చుకుంది. అంతేకాదు ఎప్పుడో కాలేజ్ నాటి నలుగురు స్నేహితులతో కలిసి ఏకంగా ఒక బృందాన్ని తయారు చేసింది .దాని పేరు హాంగ్. హ్యాండ్జవ్  లో ఉన్న క్వియూవాన్ ఫెంగ్‌హే తోటలో వీళ్ళందరూ కలిసి సంగీత సాధన చేస్తారు. తమ బృందానికి పెంగే అని పేరు పెట్టుకున్నారు అందరూ 70 ఏళ్లు దాటిన వాళ్ళే.ఈ బ్యాండులోని కీబోర్డ్ ఆర్టిస్ట్ తీయాన్ 90 ఏళ్ల పైబడిన వారు.వీళ్ళు చేసే సంగీత వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ దేశమంతా పాపులర్ అయ్యారు. ఇవాళ ఈ సంగీత బృందానికి విదేశీ ఆహ్వానాలు కూడా వస్తున్నాయి వయసు దేనికి అడ్డం కాదని నిరూపించింది ఈ బ్యాండ్.

Leave a Reply