మానసిక ప్రశాంతతకు మార్గం
ఈ రోజుల్లో అమ్మాయిల ముందున్న అతి పెద్ద సమస్య వాట్సప్ ,ఇన్‌స్టా,ఫేస్‌బుక్ వంటివి ఒక్క నిమిషం కూడా వదల లేకపోవడం .ఈ బలహీనత నుంచి బయటపడటానికి మాంక్ మోడ్ చాలెంజ్ తీసుకోమంటున్నారు నిపుణులు.ఈ చాలెంజ్ లో ఉదయం లేచిన దగ్గర నుంచి వెంటనే ఫోన్ పట్టుకోకూడదు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఉదయాన్నే లేవాలి. సినిమాలు వెబ్ సిరీస్ వీడియో గేమ్స్ చెక్ పెట్టాలి.ఉద్యోగం,అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫోన్ వినియోగం తగ్గించేసేయాలి. రోజుకి కనీసం ఒక గంట వ్యాయామం చేసి తీరాలి.ఇవన్నీ ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడమే ఈ మాంక్ మోడ్ చాలెంజ్.ఇలా చేస్తే ఏకాగ్రత పెరుగుతుందని మీలో మీరు గడిపే సమయం ఎక్కువ అవుతుందని, ఒత్తిడి ఆందోళన తగ్గి మెదడుకు విశ్రాంతి దొరుకుతుందని చెప్తున్నారు నిపుణులు. తప్పకుండా దీన్ని ప్రయత్నం చేసి చూస్తే మంచిదని ఒక సలహా కూడా ఇచ్చారు.
