కోబ్రా అధికారి
సి ఆర్ పి ఎఫ్ లో జంగిల్ వార్ ఫేర్ విభాగం కోబ్రా కి తొలి మహిళా ఇన్స్పెక్టర్ జనరల్ సంజుక్త పరాశర్. అస్సాంలో లోని గువాహటి లో 1979లో ఒక సామాన్య విద్యావంతుల కుటుంబంలో సంజుక్త జన్మించారు. ఢిల్లీ లోని ఇంద్రప్రస్థ మహిళా కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. పి హెచ్ డి పూర్తి చేశాక సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారు 2006 యూపీఎస్సీ పరీక్షలు అఖిల భారత స్థాయిలో 85వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ ఎంచుకున్నారు. అస్సాం మేఘాలయ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకొని ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2017 లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లో డీఐజీగా నియమితులయ్యారు. తాజాగా కేంద్రం ఆమెను కోబ్రా కి ఐజి గా నియమించారు .నక్సలైట్లు తీవ్రవాద నిరోధక వ్యూహాలను అటవీ ప్రాంతాల్లో అమలు చేసే ఈ అత్యంత ప్రమాదకర విభాగానికి నాయకత్వ బాధ్యతలు అందుకున్న మొట్టమొదటి మహిళా అధికారి గా సంజుక్త పరాశర్.జోర్ హాట్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో శాంతిభద్రతల సమస్యను అదుపు చేసి అధికారుల ప్రశంసలు అందుకున్నారు.చిరాంగ్ జిల్లాలో బోడో తీవ్రవాదులకు స్థానిక బెంగాలీ ముస్లింలకు మధ్య చెలరేగిన వర్గ ఘర్షణలను అణిచివేయడం లో ఆమె స్వయంగా దళాలను నడిపిస్తూ ఆ వాతావరణం అదుపులోకి తీసుకొని వచ్చారు.ఆమెను ఆప్యాయంగా ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం అని పిలుస్తారు.
