Thursday, 17 Sep, 2026

గిరిజనుల పోలియో అక్క

గీతా  కర్మాకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు 2026 అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయిగురి మారుమూల గ్రామాలు టీ తోటల సరిహద్దుల్లో నాలుగు దశాబ్దాల పాటు ఆమె సైకిల్ మీద అలుపెరగని ప్రయాణం చేస్తూ ప్రజలకు సేవ చేశారు.1983లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఆక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ గా చేరిన తరువాత మారుమూల ప్రాంతమైన దాంగువజూర్ ఝూర్ టీ తోటల సరిహద్దుల్లోకి ఆమె పోస్టింగ్ అయ్యింది. దాదాపు 23 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ టీ తోటల్లో గిరిజనులే నివసించేవారు ఆ రోజుల్లో అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ తాగునీరు లేదా రహదారి సదుపాయం లేవు కాన్పులన్నీ ఇళ్లలోనే అపరిశుభ్ర వాతావరణంలో జరిగేవి. అలాంటి సమయంలో గీత తన పాత సైకిల్ వేసుకుని 12 నుంచి 14 కిలోమీటర్లు టీ తోటల మధ్య ఉండే చిన్న చిన్న దారుల్లో రాళ్లు రప్పలు, బురదలు దాటుకుని ప్రయాణం చేసి గర్భిణీలోన కలిసి వారికి వైద్యం చేసేవారు. పిల్లలకు పోలియో రాకుండా క్రమం తప్పకుండా టీకాలు వేసేవారు. అందరూ ఆమెను పోలియో దీదీ మోని  అని పిలిచేవారు. నాలుగు దశాబ్దాల పాటు ఏఎన్ఎం గా పనిచేసిన తర్వాత జనవరి 21 లో బేలకోట గ్రామీణ ఆసుపత్రికి హెల్త్ సూపర్వైజర్ గా ఆమెకు పదోన్నతి ఇచ్చారు. మాతా శిశు సంరక్షణ తో పాటు ,పోలియో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ పాయింట్ నిర్వహణ, క్షయ, థలసేమియా,ప్రత్యుత్పత్తి ఆరోగ్య రంగం పై విస్తృత ప్రచార కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వర్తించారు గీత. ఆమె చేసిన సేవకులను ఆమెకు అత్యున్నత పురస్కారం దక్కింది.

Leave a Reply