Wednesday, 16 Sep, 2026

ఫ్యాషన్ కి చిరునామా

2012లో తన సొంత బ్రాండ్ లేబుల్ జయంతి రెడ్డి ని తన పేరు తోనే ప్రారంభించింది జయంతి రెడ్డి. ఆమె తయారు చేసే డిజైన్లలో సహజ రంగులు ఇక్కత్ ప్రింట్ లకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది.నిజామీ సంస్కృతి బెనారస్ నేత శైలి నుంచి తాను గ్రహించిన  కొత్తరకపు జర్దోసి ఎంబ్రాయిడరీ వర్క్ జయంతి రెడ్డి బ్రాండ్ కు ప్రధాన గుర్తింపు అని చెప్పుకోవాలి బాలీవుడ్ టాలీవుడ్లకు చెందిన సెలబ్రిటీలు సోనం కపూర్,శిల్పా శెట్టి,కృతి సనన్,అదితి రావు హైదరీ వంటివారు జయంతి రెడ్డి చేసిన దుస్తులు ధరించారు.ఫ్యాషన్ రంగంలో జయంతి  విజయానికి గానూ ‘ఓగ్ ఎక్సో నైకా ఫ్యాషన్ ది పవర్ ‘లిస్ట్’ అవార్డు అందుకున్నది జయంతి. హైదరాబాద్ ముంబై ఢిల్లీ వంటి నగరాల్లో ఆమెకు చెందిన లగ్జరీ స్టోర్స్ ఉన్నాయి.500 మంది కళాకారులకు ఆమె ఉపాధి కల్పిస్తుంది. సియా కలెక్షన్స్ తో లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఆరెంజ్ ట్రెండ్ చేసిన జయంతి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె తయారు చేసే మెన్స్ వేర్ లో శర్వాణి లు కుర్తాలు ఎక్కువగా ఉంటాయి వీటిని తేలికైన వస్త్రాలతో ఆడంబరం లేకుండా చాలా ఫ్యాషన్ గా సృష్టించింది జయంతి రెడ్డి.

Leave a Reply