Wednesday, 16 Sep, 2026

దేవాలయాల కథలు వినచ్చు

నమ్రత మోహన్ ను టెంపుల్ గర్ల్ అంటారు భారతదేశంలోని వందలాది పురాతన దేవాలయాలను సందర్శించి ఆ దేవాలయాల వెనుక ఉన్న అసలైన చరిత్ర శిల్పకళా చాతుర్యం ఆచారాల వెనుక ఉండే శాస్త్రీయతను ప్రజలకు చెప్తుంటారు నమ్రత.ఈ పని చేసేందుకు కాను తాను చేస్తున్న కార్పొరేట్ కంపెనీ ఉద్యోగాన్ని కూడా ఆమె వదిలేశారు.కర్ణాటకలోని మంగళూరు కి చెందిన నమ్రత మోహన్ దాదాపు 14 ఏళ్ల పాటు ఆమెజాన్ జేపీ మోర్గాన్ వంటి గ్లోబల్ కంపెనీల్లో పని చేశారు అలాగే సిటీబ్యాంక్ వాల్ట్ డిస్నీ వంటి మల్టీ నేషనల్ కంపెనీలో కూడా కీలకమైన బాధ్యత నిర్వహించారు.ఉద్యోగ జీవితంలో విజయవంతంగా ఉన్నప్పటికీ ఆమె సంతృప్తి పడలేదు ప్రాచీన దేవాలయాల పైన ఎంతో ఆసక్తి తో ఆలయాల చరిత్ర ను,కథలను యూట్యూబ్ ద్వారా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చెప్తుంటారు నమ్రత మోహన్.లక్షలు సంపాదించే కొలువు కంటే దేవాలయాలు సందర్శని తన సంతృప్తి పరిపూర్ణతను ఇచ్చాయి అంటుంది నమ్రతా మోహన్.. ఆమె కథలన్నీ ఇన్‌స్టాగ్రామ్ లో వినొచ్చు.

Leave a Reply