విజయవంతమైన సరికొత్త ఆలోచన
పంజాబ్ లోని మోగ ప్రాంతానికి చెందిన మణిదీప్ కౌర్ ఖైరా కు సొంతంగా అర ఎకరం పొలం మాత్రమే ఉంది. కానీ ఆమె భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేయవచ్చునని ఆలోచించింది. ఒక్కొక్క ఎకరం లీజుకు తీసుకుంటూ ఆమె మొత్తం 40 ఎకరాల లో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి చేరుకుంది. 45 ఎకరాల స్థాయిలో వ్యవసాయం చేయాలంటే యంత్రాలు, పరికరాలు, పెట్టుబడి, నిర్వహణ సామర్థ్యం కూడా కావాలి. మణిదీప్ కౌర్ మూడు ట్రాక్టర్లు ఏడు ట్రాలీలు ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సొంతంగా కొనుగోలు చేసింది. ఆ రకంగా ఈ మహిళా రైతు ఏడాదికి వ్యవసాయం ద్వారా 80 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.సమాజంలో సాధారణంగా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళని పెద్ద రైతులుగా భావిస్తారు.కానీ మణిదీప్ ఆలోచన అందుకు భిన్నంగా ఉంది. తనకున్న అర ఎకరానికి తోడు 40 ఎకరాలు లీజుకు తీసుకొని ఈరోజు ఒక పెద్ద రైతు గా లక్షలు ఆర్జిస్తోంది.
