Friday, 07 Aug, 2026

చదువే ఆమెకు సర్వస్వం

రేషమ్ ఫాత్మా యాసిడ్ ఎటాక్ సర్వైవర్. 2014లో 11వ తరగతి చదువుతున్న సమయంలో  17 ఏళ్ల వయసులో ఆమె పై యాసిడ్ దాడి జరిగింది. తనను పెళ్లాడను అన్నదన్న కోపంతో ఆమె సొంత బంధువే ఆమెపై యాసిడ్ తోను కత్తితోనూ దాడి చేశాడు. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆమెకు ఎన్నో సర్జరీలు జరిగాయి.జంషెడ్పూర్ లో జన్మించిన రేషమ్ ఆ ఎటాక్ జరిగిన తర్వాత చదువునే నమ్ముకుంది.ఫిజిక్స్ లో బీఎస్సీ చదువుకుని జేఎన్ యూ లో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.ఆమెకు యూకే ప్రభుత్వం ఇచ్చే చెవినింగ్ స్కాలర్‌షిప్ అందింది.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జెండర్  డెవలప్‌మెంట్ అండ్ గ్లోబలైజేషన్ లో ఆమె మాస్టర్స్ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులు యునైటెడ్  కింగ్ డమ్ లోని ప్రముఖ విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశం ఇచ్చే ప్రోగ్రాం ఇది. జె ఎన్ యూ లో చదువుతున్నప్పుడే ‘ఎబ్రా ఫౌండేషన్’ ప్రారంభించింది రేషమ్.చదువు ఆర్థిక స్వాతంత్రం పై మహిళలకు మార్గ నిర్దేశం చేసే లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది రేషమ్.

Leave a Reply