Sunday, 27 Sep, 2026

మనసున్న కమిషనర్

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి మున్సిపల్ కమిషనర్ గా సేవలందిస్తున్నారు సవితా ప్రధాన్. క్యాన్సర్  తో బాధపడుతున్న ఒక చిన్న పాప కోరిక మేరకు తన జుట్టు అంతా దానం చేసి ఆమె గుండు చేయించుకుని విధులకు హాజరయ్యారు.ఆమెకు ఫేస్బుక్ లో పరిచయమైన ఒక పాపకు క్యాన్సర్ చివరి దశలో ఉంది. కీమో లతో ఆ పాపకు జుట్టు మొత్తం ఊడిపోయింది.ఆ పాపని చూసేందుకు హాస్పటల్ కు  వెళ్లిన లలితా ప్రధాన్ తో మీ కున్న జుట్టు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తోడుగా ఎవరైనా నాలాగా గుండు తో ఉంటే బాగుండు అన్నదా పాప. మనసు కరిగిపోయిన సవితా ప్రధాన్ వెంటనే గుండు చేయించుకుని ఆ జుట్టుతో విగ్గు తయారు చేసి ఆ పాపకి కానుకగా ఇచ్చింది. గుండు తో వెళ్లి పాపకు కనిపించింది. మా అమ్మకు మూడుసార్లు క్యాన్సర్ వచ్చింది.కీమో లు చేసిన ప్రతిసారి జుట్టు రాలిపోయేది అలాంటి పరిస్థితి లో క్యాన్సర్ రోగులు ఎంత బాధ పడతారో నేను స్వయంగా మా అమ్మని చూశాను అందుకే ఈ పాప కోసం నా జుట్టు ఇచ్చాను అన్నది సవితా ప్రధాన్.ఆమె దయాగుణానికి సర్వత్రా ప్రశంసలు వచ్చాయి.

Leave a Reply