Wednesday, 05 Aug, 2026

బంగారు పతకాల పైనే గురి

9 ఏళ్ల వయసులో తండ్రి తో పాటు వెళ్లి గన్ షూటింగ్ చూసిన ఈషా సింగ్ ముందు దాన్ని సరదాగా మొదలుపెట్టి,షూటింగ్ పైన ప్రేమలో పడి ఇక సీరియస్ గా తీసుకున్నది.ప్రాక్టీస్ సమయంలో గంటలకొద్దీ ఒకే చోట నిలబడి సాధన చేయాల్సిన ఈ కష్టమైన షూటింగ్ శిక్షణ ను, దేశానికి పతకాలు రావాలన్న ఆశతో కృషి చేసింది ఈషా సింగ్. ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ లో రికార్డులు బద్దలు కొట్టి బంగారు పతకాన్ని సాధించింది.తాజాగా హాంగ్జౌ లో జరిగిన ప్రపంచ కప్ లోను బంగారు పతకం సాధించింది ఈ 21 ఏళ్ల యువ షూటర్. షూటింగ్ లో బిజీగా ఉంటూ కూడా బీబీఏ చదువు పూర్తి చేసింది ప్రస్తుతం మేనేజ్మెంట్ పీజీ చేస్తోంది. ఆటా చదువు ఒకదాని నుంచి మరొకటి నాకు విరామంగా అనిపిస్తుంది అంటుంది ఈషా సింగ్.

Leave a Reply