ఇక్కడ కాఫీ రుచి అద్భుతం
అత్యంత రుచిగా ఉండే కాఫీల్లో మెక్ డోనాల్డ్ కాఫీ కూడా ఒకటి.క్యూబా నుంచి వలస వచ్చిన డాన్ ఫ్రాన్సిస్కో తను స్థాపించిన గవీనా గోర్మే కాఫీ పొడిని ఈ రెస్టారెంట్ కి సరఫరా చేస్తాడు . క్యూబా లోని కాఫీ ఎస్టేట్ లో పుట్టిన ఫ్రాన్సిస్కో కాఫీ రుచిని చిన్నప్పటి నుంచే తెలుసుకున్నాడు.కాలిఫోర్నియాలో అతని కాఫీ ఫ్యాక్టరీ లో దొరికే కాఫీ గింజలు చాలా తాజావి. అవి ఆకుపచ్చ రంగులో ఉండగానే ఇక్కడ కు వస్తాయి.ఇందులో అసలు రుచి గింజలను వేయించడం లో ఉంటుంది. ఎంతసేపు వేయిస్తే రుచి వస్తుంది అన్నది ఫ్రాన్సిస్కో అనుభవం మీద తెలుసుకున్నాడు. సరైన ఉష్ణోగ్రతలో దాన్ని వేయిస్తాడు. అతని కంపెనీ ఉద్యోగులు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారు. ఈ కాఫీ గింజల్ని వేయించి తక్షణం ప్యాక్ చేస్తారు. మేక్ డోనాల్డ్ లో ఈ కాఫీ పొడి నే సరఫరా చేస్తారు. కొరియన్ ఐస్డ్ కాఫీ హేజెల్ నట్ పౌడర్ ,బ్లాక్ కాఫీ మొదలైన పది రకాలు ఈ రెస్టారెంట్ లో దొరుకుతాయి.ఈ కాఫీ తాగాలంటే అక్కడ రెస్టారెంట్ కి వెళ్ళాలి.
