గిన్నిస్ బుక్ లో టీచరుగారు
సాధారణంగా టీచర్లకు 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ 90 ఏళ్ళు వచ్చినా అలుపెరగకుండా పాఠాలు చెప్తూ ప్రపంచంలో సుదీర్ఘకాలం సేవలు అందించిన భాషా ఉపాధ్యాయురాలుగా గిన్నిస్ బుక్ కి ఎక్కింది బెవెర్లీ హానెట్ ప్రైస్. ఆమెకు చిన్నతనం నుంచి చదువు అంటే చాలా ఇష్టం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక 1958 లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా కెరీర్ మొదలు పెట్టింది. సైన్సు సాంకేతిక జోడించి ఆమె చెప్పే పాఠాలు పిల్లల్ని ఆకట్టుకునేవి .విద్యార్థులకు పాఠ్యాంశాల తో పాటు జీవితానుభవాలు కూడా చెబుతూ వారిలో స్ఫూర్తి కలిగించేది.దివంగత నటుడు రాబిన్ విలియమ్స్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మన్ ఈమె శిష్యులు .ఉపాధ్యాయ వృత్తి కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి గా బేవర్లి గిన్నిస్ బుక్ లో ప్రవేశించి రికార్డ్ సర్టిఫికెట్లు తీసుకుంది. చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు అది మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం అంటుంది బెవెర్లీ.
