Tuesday, 07 Jul, 2026

మహిళా సాధికారత లక్ష్యం!

ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో చదువుకున్న అన్య విగ్ ‘హర్ హక్’ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించింది. మహిళా సాధికారత,నెలసరి ఆరోగ్యం,లింగ సమానత్వం పైన ఈ ట్రస్టు పనిచేస్తుంది.పాఠశాలలు,మురికి వాడలు ఎన్జీవోల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. పీరియడ్స్ సమయంలో ఇంట్లో ఉండే  మహిళలకు కుటుంబ వ్యక్తులు ఎలా సాయం చేయాలో చెప్తారు.కొందరు ఎన్జీవోల సహకారంతో సానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ లను ఏర్పాటు చేశారు.ఈ సంస్థను దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలని అన్య లక్ష్యం.ప్రస్తుతం ఢిల్లీ, హర్యానా,ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ సంస్థ పని చేస్తుంది. మారుమూల ప్రాంతాల మహిళలకు వారి హక్కులపై అవగాహన కలిగించడం ఈ సంస్థ లక్ష్యం.

Leave a Reply