మేజర్ అభిలాష బరాక్ భారత సైన్యంలో తొలి మహిళ యుద్ధ హెలికాప్టర్ పైలట్ గా రికార్డ్ సృష్టించారు లెబనాన్ లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం లో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీం కమాండర్ గా భారత బెటాలియన్ లో పనిచేస్తున్నారు అభిలాష. 2025 సంవత్సరానికి గాను యు.ఎస్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోనున్నారు. పశ్చిమ ఆసియా దేశం లోని మహిళలు టీనేజ్ అమ్మాయిల కోసం చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాలకు గాను ఆమెకు ఈ అవార్డు ఇచ్చారు. అభిలాష ది హర్యానా లోని తానే రిటైర్డ్ కల్నల్ యస్ ఓ సింగ్ కుమార్తె. 2022 భారత సైన్యంలో తొలి మహిళా కంబాట్ ఏవియేటర్ గా గుర్తింపు పొందారు.













