ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో ఎంఫిల్ పూర్తి చేసిన వినయనా ఖురానా జీవితం స్ఫూర్తి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. ఢిల్లీకి చెందిన వినయనా సెలెబ్రెల్ పార్సీ తో జన్మించింది .కాళ్లు, చేతులు, మాట, నడక అన్ని సమస్యలే. అయినా చక్కగా చదువుకొని ఢిల్లీ యూనివర్సిటీ లోనే గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తోంది. ఎంతోమందికి మెంటారింగ్ చేస్తుంది. సోషల్ మీడియా వేదిక గా ఎంతో మంది లో స్ఫూర్తి నింపుతోంది .ఆ క్రమంలో ఎన్నో అవార్డులు తీసుకుంది .కనీసం పెన్ను పట్టుకొని సరిగ్గా రాయలేని, లేచి రెండు అడుగులు వేయలేని వినయనా ప్రయాణం ఎందరికో ఆదర్శం.














